14 అక్టోబర్, 2013

బాల్యం గుర్తుచేసిన బతుకమ్మ

నాకు చిన్నప్పటి దసరా జ్ఞాపకాలు అంటే గుర్తుకువచ్చేవి, ఇంటి చుట్టుపక్కల అమ్మయిలు ఆడే బొడ్డెమ్మలూ, అమ్మలు ఆడే బతుకమ్మలూ. పట్నం బతుక్కి అలవాటు పడ్డాక పొద్దు పొడిచాక గారె పాయసాలు, పొద్దు పోయాక జమ్మాకు తో దీవెనలు అలానే వున్నా, బోడ్డేమ్మ, బతుకమ్మలు మాత్రం గతం అనే రైలెక్కేసాయి. చదువు పేరు మీద మైసూరుకొచ్చి పడ్డాక, ప్రతి దసరాకి మైసూరులో వుండడంతో అసలు బతుకమ్మని చూసే భాగ్యం లేకపోయింది.

ఇక్కడికొచ్చాక, న్యూ జెర్సీ, డల్లాస్ లాంటి చోట్ల బతుకమ్మ ఆటల వీడియోలు చూసినా, లాస్ ఏంజెలెస్ లో బతుకమ్మ గురించి ఎక్కడా వినక ఇక్కడ లేదేమోననుకున్నా. అలాంటిది, ఇక్కడ కూడా వుందన్న విషయం తెలిసి పరుగెత్తుకుంటూ వెళ్లిపోయా. ముందే నా ఫ్రెండు ఆర్గనైజెర్ తో మాట్లాడటంవల్ల జరుగుతున్న ఈవెంట్లో వున్న ప్లానింగ్ గురించి కొంచెం ఐడియా వచ్చింది. నా వంతు సాయంగా ఒక ట్రే స్వీటుతో అక్కడ చేరిపోయా. కానీ, అక్కడికెళ్లాక తెలిసింది, ఇలాంటి ఈవెంట్ వెనక ఎంత కష్టం వుంటుందో. అందుకే, అక్కడ వున్న టైంలో నావళ్ల వీలైన శ్రమదానం కూడా చేసా.

చాలఏళ్ల తర్వాత ఇంతమంది ఒక్కచోట కూడి బతుకమ్మ ఆడటం చూస్తే, క్షణాళ్లో మనసు బాల్యంలోకి పరిగెత్తింది. చిన్నప్పుడు, అమ్మలంతా చెరువు గట్టు మీడ బతుకమ్మ ఆడుతుంటే, పిల్లలంతా చుట్టూ పరుగెత్తడం, ఎక్కడ నీళ్లల్లో పదతారో అని కొందరు పెద్దలు కాపలా కాయడం... ఇలా నా అనుభవాలన్నీ ఒక్కసారి కల్లముందు సజీవంగా జరుగుతుంటే, మనసు పులకించింది. ఒక పది పదిహేను మంది ఓ నాలుగైదు బతుకమ్మలతో ఆడుతారని మైండ్ సెట్ చేసుకుని పోయిన నాకు యాభైకి పైచిలుకు మంది ఇరవయ్యైదు బతుకమ్మలతో ఆడుతుంటే ఆశ్చర్యం, ఆనందం కలిసిన ఒక రకమైన ఫీలింగ్.

సాయంత్రం చిరుతిళ్లు, రాత్రికి భొజనాలు, ఒకపక్క బతుకమ్మలు... ఒకరికొకరు తెలియని ఇంతమందిని ఒక్కదగ్గరికి చేర్చి, ఇలాంటి ప్రోగ్రాం చెయ్యాలంటే, ఎంతో ఓపిక, కమిట్మెంట్ వుండాలి. అంత కమిట్మెంట్ తో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసిన నిర్వాహకులకు నా అభినందనలు. ఇలాంటి కార్యక్రమం కోసం ఎంత శ్రమదానం చేసినా తక్కువే అని నా పర్సనల్ ఫీలింగ్.

అన్నింటికీ మించిన అచీవ్మెంట్ అంటే, మూడేళ్ల కింద 10 మందితో మొదలైన ఇలాంటి కార్యక్రమాన్ని, నిన్న 250 మందితో, ఎలాంట్ టికెట్టూ గట్రా లేకుండా పూర్తిగా ఒక ఇంట్లో ఫంక్షన్ మాదిరిగా ఆర్గనైజ్ చేసిన TGANA వారికి నా శుభాభినందనలు.

ఆందరికీ దసరా శుభాకంక్షలతో, నిన్నటి బతుకమ్మలో ఓ భాగం కింద మీ కోసం