మా బ్యాచ్‌లో వున్న 20 మందిమి కలిసి ప్రతి 2 నెలలకొకసారి పార్టీ చేసుకునేవాళ్లం. ఆ మధ్యలో పుట్టినరోజు వచ్చినవాళ్లు ఆ పార్టీ కి స్పాన్సర్స్ అన్నమాట.(అఫ్‌కోర్స్, ఎంత స్పాన్సర్ అనే మాట వాడినా, పార్టీ ఇచ్చిన వాళ్లకి గిఫ్ట్‌లు పోయేవి లెండి.) మేమున్న లేఅవుట్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో బెంగళూరు రోడ్‌లో పల్లవి ధాబా అని వుండేది. అదే మాకు పార్టీ స్పాట్. మేము ఇరవై మందిమి వెళ్లేవాళ్లం. పార్టీ మొదలైన దగ్గరినుంచి అయిపోయేవరకు మా గొంతులు పోయేలా అరుచుకోవడానికీ, కొట్టుకోవడానికీ మాకు ఒక టాపిక్ కావాలి. అదేమిటో గానీ, ప్రతీసారీ ఒకే టాపిక్ వచ్చేది. అదే చిరంజీవి Vs పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అను మేము కొట్టుకునేవాళ్లం. వాల్లు మాత్రం బాగానే వున్నారు, అది వేరే విషయం. ఇప్పటికే మీకు ఒక డౌటు వచ్చింటుంది... మేము ఎంత వెదవలం కాకపోతే ఈ టాపిక్ పెట్టుకుంటాం అని... కాని పార్టీ అన్నాక వాదులాట వుండాలి కాబట్టి ఏదో ఒకటి అని స్టార్ట్ చేసేవాళ్లం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మా ఇరవై మందిలో 17 మంది చిరంజీవి ఫ్యాన్స్.(వీల్లలో కొందరు బాలకృష్న ఫ్యాన్స్ కూడా వున్నారు, కాని ఆ టైంలో చిరంజీవి ఫ్యాన్స్ అవతారం ఎత్తేవాళ్లు. వీళ్ల గురించి మళ్లీ మాట్లాడుకుందాం.) ఒకడు రజనీకాంత్ ఫ్యాన్, ఇంకొకడు నాగార్జున ఫ్యాన్. మిగిలిన ఒక్కడు మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్... యస్స్, మీరు కరెక్టే. నేను అప్పట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌ని.
చెప్పాలంటే మొదట్లో నేను పవర్‌స్టార్‌కు అంత పెద్ద ఫ్యాన్ ను కాదు. కాని, నేను హైదరాబాద్ లో లాంగ్ టరం చేసే రోజుల్లో సంధ్య థియేటర్ మీద చేసిన దాడుల గురించి తెలిసిన మిత్రులంతా కలిసి నన్ను పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిని చేసేసారు. మొదట్లో నాకు చిరంజీవి అంటే ఇంత వ్యతిరేకత లేదు. ఎక్కడో ఒక మూల కొద్దిగా ఇష్ఠం వుండేది అనుకుంటా. కానీ రెండు విషయాలు నాలో చిరంజీవి అంటే వ్యతిరేకతను పెంచాయి.
1. ఇది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు కానీ, అప్పట్లో ఏదో మ్యాగజైన్ లో చదివాను. "అన్నయ్య" వంద రోజుల ఫంక్షన్లో చిరంజీవి మట్లాడితూ "ఈ సినిమా వేరే వాల్లు చేసుంటే ఇన్ని రోజులు ఆడేది కాదు... ఒక 50 రోజుల సినిమా. కానీ నేను చెసిన సినిమా కబట్టి 75 రోజులు ఆడుతుంది అనుకున్నా. కానీ ఫ్యాన్స్ ఆడించడం వల్ల 100 రోజులు ఆడింది....." అంటూ ఇంకా చాలా మాట్లాడినట్టు చదివా. అది చదవగానే, రెకార్దుల కోసం అలా ఆడించడం వెనుక చిరంజీవి ఎంకరేజ్‌మెంట్ వుంది అని నాకు అర్థం అయ్యింది. నేను తప్పుగా అర్థం చేసుకుని వుండవచ్చు, కానీ అప్పుడే నాకు చిరంజీవి అంటే వున్న కొద్ది ఇష్ఠం కాస్తా పొయ్యింది.
2. ఇంద్ర సినిమా. సినిమా బాలేదు అని నేను అనను. కానీ చిరంజీవి ఆ సినిమా చెయ్యకూడదు అనేది నా వాదన. అప్పటికే చిరంజీవికి వున్న క్రేజ్, స్టార్‌డం చూసుకుంటే ట్రెండ్‌సెట్టర్ సినిమాలు తీయాల్సిన చిరు హిట్ కోసం ఆల్రెడీ సెట్ అయివున్న ఫాక్షన్ అనే ట్రెండ్ ఫాల్లో అయ్యాడు. ఆ ట్రెండ్ కూడా అప్పుడు అదే రేంజ్‌లో వున్న బాలకృష్ణ సెట్ చేసింది. ఇన్ని సంవత్సరాల స్టార్‌డం, మాస్ అభిమానగణం వుండి, కలెక్షన్ల పరంగా తెలుగు సినిమా స్టామినా మార్చిన హీరోగా పేరుండి, కేవలం ఒక్క హిట్ కోసం వేరొకరు సెట్ చేసిన ట్రెండ్‌లో వెల్లడం తప్పు అని నా వాదన.
ఈ రెండు విషయాలను పక్కన పెడితే, మా చిరు Vs పవన్ గొడవల్లో చాలా పాయింట్లు వచ్చేవి. ఏ పార్టీ అయినా చివరకు గొడవ మాత్రం ధాభా వాడు మమ్మల్ని వెళ్లిపొమ్మనేంతవరకూ జరిగేవి. ఆ మధ్యలో కోపాలకు పోయి ఆవేశంతో కొట్టుకోవడాలూ, బాటిల్సు పగులగొట్టి ఒకరి మీదకి ఒకరు పరుగు తీయడాలు.... అదో వింత సరదా. ఈ మధ్యలో ఇద్దరు మాత్రం ఈ గొడవేది పట్టనట్టు వేరే పని మీద వుండేవాళ్లు. వాల్ల పని అంతా మా దగ్గర ఆర్డర్ తీస్కోవడం, ధాభా వానికి ఇవ్వడం... మళ్లీ ఆర్దర్ ఇచ్చినవన్నీ వచ్చాయో లేదో చూసుకోవడం. ఇదంతా ఇప్పుడు గుర్తుచేసుకోగలనే కానీ మళ్లీ సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే, ఇప్పుదు మల్లీ ఆ ఇరవై మందీ కలవరు. ఒకవేళ సగం మంది కలిసి వెళ్లినా, ఆ అన్నదమ్ముల గొడవలెందుకురా టైం వేస్టూ అని కన్‌క్లూడ్ చేసుకుని, పెళ్లి అయినవాల్లంతా కలిసి బ్యచిలర్ల బుర్ర తినే ప్రోగ్రాం పెడతారు. ఇక్కడ వాల్ల తప్పు కూడా లేదు లెండి. వాల్ల వాదన కూడా కరెక్టే. "Happyness is not the only virtue in life" అని చెప్పి, కష్టాల కడలిని ఈదడానికి తోడు రమ్మంటారు..... అతితెలివి అంకుల్సు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి