అనగా అనగా, అంటే కొన్ని సంవత్సరాల క్రితం మాట అన్నమాట. మేము ఫ్రెండ్స్ అందరం ఉద్యోగప్రయత్నాల్లోంచి బ్రహ్మిగా రూపాంతరం చెందిన కొన్ని రోజులకి, అందరం కలిసి ఈ సింగిల్ రూముల్లో బతుకు వెళ్లదీయడం దేనికిలే అని ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకుని అక్కడికి మారాం.
మామూలుగానే స్వతహాగా అన్ని బ్యాచిలర్ బ్యాచులకి వుండే అత్యుత్సాహం కొద్దీ కొత్త ఫ్లాట్‌లోకి అడుగుపెట్టే ఒకటి రెండు రోజులముందు అనుకున్నాం. కొత్త ఫ్లాట్‌లో అయినా ఈ మెస్సు ఫుడ్డు మానేసి రోజూ రాత్రి వంట వండుకుందాం. వీలయితే మధ్యాహ్నం బాక్సులు తీసుకెళ్దాం. ఓపిక వుంటే పొద్దున టిఫిన్ చేసుకుందాం. ఇక నుంచి బయట ఫుడ్డు కోసం పైసా కూడా ఖర్చుపెట్టకూడదు అని సవాలక్ష ప్లాన్లు వేసాం. మామూలుగా అయితే ఇది ఎక్కువ కాలం జరగాల్సిన ప్రక్రియ కాదుగానీ, మావాల్ల ఉత్సాహ ప్రదర్షన మూలంగా కొంచం, బయటి ఫుడ్డుమీద ఇంట్రెస్టు పోవడం మూలంగా కొంచెం ఆ అలవాటు అలా సా...గి పోయింది, కొన్ని సంవత్సరాలపాటు.
ఇక అసలు విషయానికొస్తే, మేము ఆ ఫ్లాట్‌లోకి మారిన కొన్నిరోజులకి వినాయకచవితి పండగొచ్చింది. మామూలుగా ప్రతీ చిన్నదానికి ఇంటికి పరిగెత్తే మేము అదేంటోగానీ, ఆ పండక్కి మాత్రం అందరం బెంగుళూరులోనే వున్నాం. అప్పటికే కొన్ని రోజులు రూమ్మేట్సు వండింది తిని బాగా కాకపోయిన, కొద్దిగా బలిసిందేమో, పొద్దున లేవంగానే నాకో వింత ఆలోచన పుట్టింది. రోజు అందరూ కలిసి విడివిడిగా, కలివిడిగా తలా ఒక చెయ్యి వేస్తూ వంట చేస్తే నేను మాత్రం వంట చేసేప్పుడు వాళ్లనీ, తినేప్పుడు టివి ని చూడటం తప్ప వేరే ఏమి చెయ్యట్లేదని బాధేసింది. అలాగే వుంటే ఆ బాధతో డిప్రెషన్‌లోకి పోతానేమో అని భయమేసింది. ఆ తర్వాత ఇంత చెత్తగా ఆలోచిస్తున్నందుకు నామీద నాకే అసహ్యమేసింది (నాక్కూడా అని నాగార్జున లాగా మీరు అనుకోకండే). ఏదో ఒకటి చేసి నేను సైతం అనిపించేద్దామని డిసైడ్ అయ్యా.
డిసైడ్ చేసుడే ఆలస్యం, తెగ ఆలోచించీ చించీ... ప్రసాదం కింద పాయసం చేసి వినాయకుడికి నైవేద్యం పెడదామనే ఆలోచన నా మిత్రగణం ముందుంచా. ఒక్కడు కూడా కనీస స్థాయిలో ప్రోత్సాహం ఇవ్వకపోగా నీకెందుకురా ఈ దూల అని రకరకాలుగా పరిహసించి, నాలో ఆగ్రహ జ్వాలలు రేగేలా నన్ను వుసిగొల్పారు. వీళ్లకి ఎలాగైనా బుద్ది చెప్పాలి, పాకశాస్త్రంలో నేను ఎంతటి ప్రావీణ్యం సంపదించగలనో నిరూపించాలి ఈ మందబుద్దులు గ్రహించేలా చెయ్యాలని కంకణం కట్టుకున్నా. (ఆరోజు చూసిన వినాయక మహత్యం సినెమా డైలాగులు ఇప్పుడు నా మైండ్లో తిరుగుతున్నాట్టున్నాయి. అందుకే, భాష పట్టు తప్పుతోంది). అనుకున్నదే తడవుగా రోడ్డెక్కేసా, పాయసానికి కావాల్సిన వస్తువులు తేవడానికి. అప్పటికే నాకు తెలిసిన పాకశాస్త్రం పుస్తకానికి ఒకసారి దుమ్ము దులిపితే తెలిసింది, పాలు, చక్కెర, సేమియా వుంటే పాయసం చెయ్యొచ్చని.
షాపుకెళ్లాను గానీ, ఏది ఎంత వెయ్యాలో తెలీదు. అర లీటరు పాలు, ఒక సేమియా పాకెట్టు తీసుకున్నా. చక్కెరెంత పడుతుందో తెలీదు. కనుక్కుందామని ఇంటికి ఫోన్ చేసా. నాన్న ఫోన్ తీసాడు. నన్ను అసలు విషయంలోకి దిగనివ్వకుండా స్నానం చేసావా లేదా, గుడికెళ్లావా లేదా అని సిబిఐ రేంజిలో అడిగేసాడు (నేనంటే ఎంత నమ్మకమో, నేనలాంటి పనులు ఎన్ని సార్లు చెప్పినా మర్చిపోతానని). ఈ ప్రశ్నావళిని మధ్యలో తుంచేసి అమ్మకి ఫోనివ్వమన్నా. అమ్మ బిజీగా వుంది, విషయం ఏంటో చెప్పమన్నాడు. పాయసం అయిడియా చెప్పి, చక్కెర ఎంత కావాలి అని అడిగా. ఒక పావుకిలో తీస్కుని ఇంటికి వెళ్లు, అమ్మ ఫ్రీ అయ్యాక ఫోన్ చేయిస్తా అప్పుడు ఎంత అంటే అంత వెయ్యొచ్చు అని నాన్న సలహా ఇచ్చాడు. ఇదేదో బాగుందే అని అలాగే చేసా.
ఇంటికెళ్లి పాలు కాచాను కానీ అమ్మ నుంచి ఫోన్ రాలేదు. ఎలాగూ వెయ్యాల్సిందే కదా అని సేమియా కూడా వెసేసా... అది కూడా ఓ మోస్తరు ఉడికింది(??). ఇంకా అమ్మ నుంచి ఫోన్ లేదు. నాలో ఓపిక లాస్ట్ ఇయర్ సెన్సెక్స్ పడ్డట్టు పడిపోయింది. మళ్లీ ఇంటికి ఫోన్ చేసా. అమ్మ ఇంకా బిజీ అన్నాడు నాన్న. ఇక లాభం లేదని, ఎదురు చూస్తే కిచెన్ లో నిలబడి కాల్ల నొప్పూ తప్ప ఇంకేమి మిగిలేలా లేదని ఆలొచించి తెచ్చిన చక్కెర మొత్తం పాలల్లో వేసేసా. అదేంటో, వేసిన 30 సెకన్లకి అమ్మ ఫోన్ చేసింది. ఎంట్రా అంటే, ఏం లేదు పనైపోయింది అని చెప్పి పెట్టెసా. గిన్నె మీద మూత పెట్టి మొబైల్ లో ఒక గేం ఆడుకున్నా. ఒక రెండు నిమిషాలాగి, గేము అయ్యాక మూత తీసి చూస్తే, సేమియా బ్రహ్మాండంగా వుంది. అవును, సేమియా మాత్రమే వుంది, చుక్క పాలు కూడా లేవు. సర్లే, అందరికీ, గిన్నెలో పోసిచ్చెబదులు, చెంచాతో డైరెక్టు చేతిలో వెయ్యొచ్చు కదా అనుకుని, దేవునికి నైవేద్యం కూడా చూపించేసా.
తర్వాత రుచి చూద్దును కడా, అది పాయసంలా కాక హల్వా లాగ తయారైంది. దాని విషయం తెలిసిన నా రూమ్మేట్సు కనీసం దాన్ని ప్రసాదం కింద కన్సిడర్ చేసి రుచి చూడమన్నా కుడా కుదరదని తేల్చేసారు. తప్పనిసరి పరిస్థితుల్లో అలా నా మొదటి వంట పెంటలోకి చేరింది. అదేంటో, ఇది జరిగి ఇన్నేళ్లయినా కుడా, ఇప్పటికీ మావాళ్లు నేను కిచెన్‌లోకి వెళ్తున్నానంటే జడుసుకుంటారు. సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే, నాకు పెళ్లయ్యాక మావాళ్లు ఈ అనుభవాన్ని కొద్దిగా మసాలా దట్టించి నా భర్యకు చెప్పారు. ఇప్పుడు నేను వంట నేర్చుకుంటా అని చెప్పినా, నా భార్య నన్ను వంటింట్లోకి రానివ్వట్లేదు. వా :-(
ఇది నా జీవితం. మెల్లిమెల్లిగా నా స్వగతాన్ని, దానితో పాటు జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు, వచ్చే ఆలోచనలూ... అన్నీ ఇందులో వుంటాయి, వస్తాయి.
కోతలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

09 జనవరి, 2012
15 అక్టోబర్, 2010
మీటింగ్‌లో నిద్రపోతే....?
పోయిన వారం నాకు ఆఫీసులో ఒక మీటింగ్ జరిగింది. అది కూడా లంచ్ అవ్వగానే పెట్టారు. మా టీం అంతా కలిసి లంచ్ చేసాం. ముందురోజు డిన్నర్ సరిగా చెయ్యకపోవడం వల్లనో, లేకపోతే ఆరోజు పొద్దున బ్రేక్‌ఫాస్ట్ చెయ్యకపోవడం వల్లనో, కాదంటే లంచ్ రుచిగా వుండడం వల్లనో తెలీదు కానీ భీభత్సంగా కుమ్మేసా. ఇంకేముంది, నిద్ర తన్నుకురావడం మొదలైంది. డెస్కు దగ్గరికెళ్లి కాసేపు నిద్ర పోదామని ఆలోచిస్తూ మెల్లగా కేఫిటేరియాలోంచి బయటకు వస్తూంటే మా లీడ్ పద్మజ గారు గుర్తు చేసారు "పెద్ద తలకాయల"తో మీటింగ్ వుంది కదా ఇప్పుడు అని. అందరం కలిసి మీటింగ్ వున్న ఆడిటోరియంలోకి వెళ్లాం. అప్పటికే మీటింగ్ స్టార్ట్ అయిపోయింది. హాల్లో ఒక 100 వరకు కుర్చీలు వేసారు. చివర్లో అన్నీ నిండుగా వున్నాయి. కూర్చోడానికి ఎక్కడా ప్లేసులేదని కుర్చీల వెనకాల స్నాక్సు కోసం వేసిన టేబుల్స్ మీద కూర్చున్నాం అందరం. ఒక రెండు నిమిషాలు ప్రశంతంగా కూర్చుని ఇలా సెటిల్ అయ్యానో లేదో ముందు నుంచి నా పాలిటి లేడీ విలన్ లేచి మట్లాడుతున్న జెంటిల్‌మాన్ దగ్గర మైకు లాక్కుని "వెనక టేబుల్సు దగ్గర సెటిల్ అయిన వాళ్లందరూ ముందుకు వస్తె అక్కడ కుర్చీలు ఖాళీగా వున్నాయి రండి" అని ఆహ్వానించింది. మనకి బాడ్ టైం స్టార్ట్ అయ్యింది.
అప్పుడు కదిలి చూస్తే మనకంటే లేటుగా మీటింగుకి చాలామందే వచ్చారు.అందరం కలిసి ముందుకు వెళ్లాం. అందరం ఒక వరుసలో కూర్చున్నాం. గోడ వైపు మా లీడు, పక్కన మా టీమువాళ్లు, చివర్లో... దారికి దగ్గరగా నేను. తీరా చూస్తే నేను కూర్చుంది రెండో వరుసలో. మొదటి వరుస నా ఖర్మ కాలి ఖాళీగా వుంది. అంతా బాగానే వుంది కానీ మా ప్రవీణ్‌గాడు కనపడట్లేదేంటి చెప్మా అని వెనక్కి చూసా. నా వెనక వరుసలో రెండు కుర్చీల అవతల ప్రవీణు, వాని వెనకాల నా మేనేజరూ కూర్చున్నారు. అప్పుడే నాకు కుడి కన్ను అదిరింది, అంటే సిక్స్త్ సెన్స్ పనిచేసింది. కానీ దాన్ని పట్టించుకునే మూడ్‌లో ఆ క్షణంలో నేను లేను.
ఒక అయిదు నిమిషాలయ్యింది. అప్పటిదాక మట్లాదుతున్న పెద్దాయన స్పీచుకూడా అయ్యింది. మమ్మలని ముందుకు పిలిచిన నా లేడీ విలన్ లేచి ఏదో గేం అంటూ నేను రెండో తరగతిలో వుండగా ఒక ఈమెయిల్‌లో వచ్చిన ఫొటో చూపింది. చాలా కాఫీ గింజల మధ్య ఒక మనిషి ఫేసు వుండే ఫొటో అది. ఆ ఫొటో చూపగానే ఆమెకో ఫోన్ వచ్చింది. మమ్మల్నందరినీ లైన్‌లో వుండమని చెప్పి ఆమె మాత్రం మాట్లడ్డానికి బయటికెళ్లింది. ఒక అయిదు నిమిషాల తర్వాత వచ్చి కొన్ని క్వెశ్చన్స్ వేసింది. అదేంటో, నాకు తప్ప అక్కడ ఎవ్వరికీ ఆన్సర్స్ తెలీవనుకుంటా. నేను తప్ప ఎవ్వరూ జవాబు చెప్పలేదు. నాకూ, నా విలన్ కు మధ్య డిస్కషన్ ఇలా జరిగింది.
విలన్: ఈ ఫొటోలో వున్నదేంటి...?
నేను: కాఫీ గింజలు.
విలన్: గుడ్. నువ్వు లేచి నిలబడు.
నేను: (లేచి నిలబడ్డా)
విలన్: దీనితో ఏం చెయ్యొచ్చు...?
నేను: ఫొటోనయితే సిస్టంలో వాల్‌పేపర్ గా పెట్టుకోవచ్చు. గింజలతో అయితే కాఫీపొడి చేసి దానితో కాఫీ చేసుకుని తాగొచ్చు. ఒక అయిదు నిమిషాలు టైమిస్తే ఇంకేమైనా చెయ్యొచ్చేమో గూగుల్ చేసి చెప్తా.
విలన్: బ్రహ్మాండం. అసలు నీలాంటి వానికోసమే నేను ఎదురుచూస్తున్నా. నీ అంత ఇంటెల్లిజెంట్ లేక ఇన్ని రోజులు మా మీటింగ్స్ అన్ని తెగ బోరు కొడుతున్నాయి. ఇంకొక్క ప్రశ్న వుంది, దానికి కరెక్ట్ అన్సర్ చెప్తే నీకొక సర్‌ప్రైజ్ గిఫ్ట్.
నేను: డౌటొద్దు. గిఫ్ట్ నాదే. నువ్వడుక్కో.
విలన్: కాఫీ స్పెల్లింగ్ ఏంటి...?
నేను: కే ఏ యూ పీ హెచ్ వై
అంతే, గిఫ్టు నాదైపోయింది. ఆడిటోరియం అంతా చప్పట్లతో దద్దరిల్లింది. ఆ చప్పట్లమోత నా చెవుల్లో గింగిరాలు తిరుగుతూంటే తల విదిలించా. చూస్తే నేను కూర్చొనే వున్నా. విలన్ ముందు కనపడలేదు. కానీ చప్పట్లు మోగుతున్నాయి. వెనక్కి తిరిగి చూస్తే విలన్ వేరేవాళ్లకి గిఫ్ట్ ఇస్తోంది. మనం రికగ్నైజ్ చెయ్యక కానీ, తర్వాత మా ప్రవీణ్ కి కూడా ఒక గిఫ్టొచ్చింది. అది నాకు మీటింగయ్యాక తెలిసొచ్చింది. పాపం, వానికి గిఫ్టొచ్చినప్పుడు నేను చప్పట్లు కొట్టలేదని ముందు ఫీలయ్యాడు కానీ తరువాత అర్థం చేసుకున్నాడు.
మళ్లీ స్పీచులు మొదలయ్యాయి. ఇంక నన్నడక్కండి. ఎంత మంది వచ్చారో, ఎంత సేపు దంచారో, గంటన్నర ఎలా గడిచిందో నాకైతే తెలీదు. మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు వెనక్కి తిరిగి చూస్తే మా ప్రవీణుడు వెటకారంగా ఒక స్మైల్ పడేసాడు. (అంటే నేను నిద్ర పోతున్నానన్న విషయం వాడు పట్టేసాడు) నేను అలా వెనక్కి తిరిగిన ప్రతీసారీ నన్ను ఎవరో తట్టినట్టనిపించే చూసాను. అది వేరే విషయం. రెండోసారి చూసినప్పుడు అనిపించింది... నా పక్కన కూర్చున్న వినోద్ నన్ను తడుతున్నాడు అని. ఎందుకైనా మంచిది కంఫర్మ్ చేసుకుందామని అడిగా "నీకు కాలేజీ రోజుల్లో నిద్రపోతున్న వాళ్లని లేపే అలవాటు బాగా వుండేదా...?" అని. 'యెప్పీ' అని స్టైల్‌గా చెప్పాడు.
అలా అలా మీటింగ్ అంతా అయిపోయి బయటికొచ్చాక తెలిసింది ఏమీ అంటే, చివర్లో మాట్లాడిన మాస్టారు అందరికంటే పెద్దతలకాయంట. జోకులు కూడా బాగా పేల్చాడంట. నన్ను ఆఅహించిన నిద్రాదేవత విశ్వరూపాన్ని కూడా చూసాడంట. మా ప్రవీణడు చెప్పాడు... "ఆ పెద్దతలకాయ ప్రతీ జోకుకి జోకుకి మధ్యలో నీవైపు కంఫ్యూజింగ్‌గా చూసాడు. అందరి నవ్వులకి నువ్వు తల విదిల్చి నవ్వుతుంటే అది వేసిన జోకుకి నవ్వావో, వేయబొతున్న జోకుని ఎక్స్‌పెక్ట్ చేసి నవ్వావో అర్థం కాక.. పాపం" అని.
అసలు పోస్ట్ లంచ్‌లో ఇలాంటి మీటింగ్స్ పెట్టేదే సుఖంగా నిద్ర పోవటానికి నా ఫీలింగ్. అలాగే ఈరోజు కూడా ఒక మీటింగ్ పెట్టారు, తెల్లవారుఝామున ఎనిమిదిన్నరకి. దానికితోడు మాటీమువాళ్లందరికీ ఈ మొదటిబెంచీలో కూర్చునే అలవాటు ఏంటో అర్థం కాదు. వెనక కొన్ని సీట్లు ఖాళీగా వున్నాకూడా వెళ్లి మళ్లీ రెండో వరసలో కూర్చున్నారు. అందులో మొదటి స్లైడ్‌లోనే దయచేసి గురకపెట్టొద్దు అని చెప్పారు. అంటే సైలెంటుగా నిద్ర పోవచ్చనే కదా. మరేంటి, ఆ స్లైడ్ చుస్తూనే మా టీమువాళ్లంతా నవ్వుతూ నావైపు చూసారు....?

23 సెప్టెంబర్, 2010
నలుని వంట... భీముని తంట...!?!?!?!
అది అనగా అనగా, అంటే కొన్ని సంవత్సరాల క్రితం మాట అన్నమాట. మేము ఫ్రెండ్స్ అందరం ఉద్యోగప్రయత్నాల్లోంచి బ్రహ్మిగా రూపాంతరం చెందిన కొన్ని రోజులకి, అందరం కలిసి ఈ సింగిల్ రూముల్లో బతుకు వెళ్లదీయడం దేనికిలే అని ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకుని అక్కడికి మారాం.
మామూలుగానే స్వతహాగా అన్ని బ్యాచిలర్ బ్యాచులకి వుండే అత్యుత్సాహం కొద్దీ కొత్త ఫ్లాట్‌లోకి అడుగుపెట్టే ఒకటి రెండు రోజులముందు అనుకున్నాం. కొత్త ఫ్లాట్‌లో అయినా ఈ మెస్సు ఫుడ్డు మానేసి రోజూ రాత్రి వంట వండుకుందాం. వీలయితే మధ్యాహ్నం బాక్సులు తీసుకెళ్దాం. ఓపిక వుంటే పొద్దున టిఫిన్ చేసుకుందాం. ఇక నుంచి బయట ఫుడ్డు కోసం పైసా కూడా ఖర్చుపెట్టకూడదు అని సవాలక్ష ప్లాన్లు వేసాం. మామూలుగా అయితే ఇది ఎక్కువ కాలం జరగాల్సిన ప్రక్రియ కాదుగానీ, మావాల్ల ఉత్సాహ ప్రదర్షన మూలంగా కొంచం, బయటి ఫుడ్డుమీద ఇంట్రెస్టు పోవడం మూలంగా కొంచెం ఆ అలవాటు అలా సా...గి పోయింది, కొన్ని సంవత్సరాలపాటు. అదిగో అప్పుడు మొదలైంది నాకు ఇంట్లో సుప్రభాతం... వంట నేర్చుకొమ్మని. వారానికొకసారైనా వంట నేర్చుకోరా అని చెప్పకుండా ఫోన్ పెట్టేసేది కాదు. కానీ, మా రూమ్మేట్సు మాత్రం చాలా మంచోల్లు. నన్ను కొన్నేళ్లుగా చూసిన అనుభవం వల్ల నాన్ను ఏనాడు వంట నేర్చుకొమ్మని చెప్పలేదు సరికదా, నేను కిచెన్‌లోకి పోతుంటేనే భయపడిపోయి నాకు ఏంకావాలో అడిగి అది చేసిచ్చేవాళ్లు. హైటు తగ్గిన భీమునిలా వుండే నేను నలుని వంటను మించిన రుచికరమైన వంట (టైటిల్ జస్టిఫికేషన్) చేద్దామన్న కల అలాగే మిగిలింది. అలా జీవితం స్వర్గంలా గడిచింది ఒక 3 సంవత్సరాలు.
ఈలోపున ఒక్కొక్కరికి పెళ్లిల్లు అవడం, ఒక్కొక్కడుగా ఫామిలీ పెట్టుకోవడం జరిగిపోయింది. చివర్లో ఒకడు అదే ఫ్లాట్‌లో ఫామిల్య్ పెట్టుకోవడం, నాతో పాటు మిగిలిన పెళ్లి కాని ప్రసాదు అమెరికాకి ఆన్సైటు రావడం వల్ల నేను వేరే కొందరు ఫ్రెండ్స్ వున్న రూములోకి షిఫ్ట్ అయ్యా. పాపం, అమ్మకి అప్పటికీ నేను వంట నేర్చుకుంటానన్న ఆస చావక అడిగింది... ఏరా, ఈ రూములో కూడా వండుకుంటారా...? అని. బ్రహ్మాండంగా అని నా సమాధానం విని తెగ సంబరపడిపోయి కనీసం ఇక్కడైనా వంట నేర్చుకోరా అని బతిమాలింది. కానీ ఏం లాభం... ఇక్కడి రూమ్మేట్సు మనం ఆఫీసునుంచి వచ్చేసరికి వండేసి, మందేస్తూ మనకోసం ఎదురు చూస్తూ వుండేవాళ్లు. అలా మనకి ఎక్కడికి వెళ్లినా తినిపెట్టే అద్రుష్టం, మిగిలిన వాళ్లకి వండిపెట్టే మహాభాగ్యం కలిగాయన్నమాట.
పాపం, అమ్మ మాత్రం మీ ఫ్రెండ్సు దగ్గర నేర్చుకోరా... ఏనాటికైనా పనికొస్తుంది అని చాలారకాలుగా చెప్పిచూసింది. ఒకట్రెందు సార్లు ఇంట్లో పాకశాస్త్రం మీద క్లాసులు తీసుకోవాలని కూడా ప్రయత్నించింది కానీ పెళ్లి బూచి చూపి తప్పించుకున్నా.
అలా జీవితం ముప్పూటలా పక్కనవాడు వండింది తుంటూ సాగదీస్తున్న రోజుల్లో మార్గదర్శిలో చేరకుండానే ఒక ఆన్సైటు దొరికింది. ఈవిషయంలో అందరికంటే ఎక్కువగా సంతోషపడింది మా అమ్మ. అదికూడా నేను విదేశాలకు పోతున్నాననేకంటే, ఇప్పుడూ ఎలాగైనా తప్పదు కాబట్టి అక్కడ వంట నేర్చుకుంటాడు అని. కానీ మా అమ్మొకటి తలిస్తే విధి ఇంకోటి తలచింది. ఇక్కడికొచ్చి చూస్తే, సాటి హైదరబాదీయుడు, నా బెంగళూరు రూమ్మేట్సుకంటే మంచోడు. కిచెన్‌లో నేను చేయగలిగిన ఏకైక కార్యక్రమం కుక్కర్‌లో బియ్యం పెట్టడం. నేను అది చేసినా కూడా "పర్లేదు, నేను పెట్టేస్తా, నువ్వెళ్లి కూర్చో" అని చెప్పిన సహృదయుడు.
ఈ విషయం మా అమ్మకు తెలిసి నాకు వంట చేసే భాగ్యం ప్రసాదించమని కనిపించన ప్రతీ రాయికీ మొక్కేసి, కనిపించిన ప్రతీ గుళ్లోకీ వెళ్లి ప్రత్యేక పూజలు కూడా చేయించింది. ఏ గుళ్లో ఏ దేవుని డెసిషనో తెలీదు కానీ, ఇక్కడ మా రూమ్మేటుకి పని పెరగడం స్టార్ట్ అయ్యింది. వరుసగా వారం రోజులపాటు ఇద్దరం పచ్చడి మెతుకులతో ముప్పూటలా ముగించేసాం. ఇలా ఎంతకాలం అని ఒక చిన్న ఆత్మశోధన చేసుకుని, ఒకరోజు నేను వంట చెయ్యాలని డిసైడ్ అయ్యా.
ఆఫీసులోనే అందుకు తగ్గ కసరత్తు మొదలెట్టేసి, యూట్యూబు లో ఆలుగడ్డ కూర మీద ఒక వీడియో చూసి, ఇంకో రెండు సైట్లల్లో ఎలా చెయ్యాలో చదివేసి రూముకి బయలుదేరా. దార్లో మా ఉమాని కూడా అడిగా, ఎలా చేయ్యాలి అని. తను కూడా ఓంట్లో వున్న ఓపికనంతా తెచ్చేసుకుని కూర ఎంతసేపు చెయ్యాలో అంతసేపు విసుగుతెచ్చుకోకుండా ఎక్ష్‌ప్లెయిన్ చేసాడు.
ఇంటికెళ్లాక కాస్త ఫ్రెష్ అయ్యి, కిచెన్‌లోకి అడుగుపెట్టా. కదనరంగంలో కాలు పెట్టిన కొత్త సైనికుడిలా నా గుండె వేగంగా కొట్టుకోసాగింది. అరగంట కష్టపడి ఆలుగడ్డా, ఉల్లిగడ్డ కోసేసి, పచ్చిమిరపకాయలు కోయబోతూ కారంతో సరిపెడదామని డిసైడ్ అయ్యా. ఆ తరువాత ఏం చెయ్యాలా అని చాలాసేపు ఆలోచించా. ఏదో మరిచిపోతున్నా అని తట్టింది కానీ ఏం మరిచిపోయానో తట్టలేదు. ఇలా కాదులే అని మా ప్రదీప్ కి ఒక ఫోన్ కొట్టా. మనవాడు, ఆలుగడ్డ ఫ్రై గావాల్నా, గ్రేవీ గావాల్నా, కర్రీ గావాల్నా అని వెంకీ సినిమాలో కృష్ణ భగవాన్ లాగా చాలా ఆఫర్స్ ఇచ్చాడు. ఏదో ఒకటి అని కర్రీ దగ్గర డిసైడ్ అయ్యాక అది వుందా, ఇది వుందా అని చాలా వాటికి నాతోనే లేవనిపించి ఎర్ర ఫ్లైటెక్కి వంటచేయడనికొచ్చానని చిన్న కామెంటేసి వున్నవాటితో ఎలా వండాలో చెప్పాడు. ఏదో మరిచిపోతున్నా, మరిచిపోతున్నా అని అనుకుంటూ అన్నీ తను చెప్పింట్టే చేసేసి... కూర అయిందనిపించా.
హమ్మయ్య... నేను కూడా వంట నేర్చుకున్నా అని ఆనందించి వెంటనే ఆ ఆనందాన్ని ఒక పోస్టు ద్వారా అందరితో పంచుకుందామని, ఇన్స్పిరేషన్ కోసం తోటరాముడు ఓపెన్ చేసి 32వ సారి మగ పిల్లాడు - పిల్ల మగాడు పోస్టుని చదివేసి, 34వ సారి వివాహ భోజనంబు - వింతైన వంటకంబు పోస్టుని చదువుతుంటే మా రూమ్మేటు వచ్చాడు. టేస్టు చూసి ఎలా వుందో చెప్పమన్నా. రమణ గోగుల, అను మలిక్ కలిసి పాడిన పాటకు కృష్ణ, రాజశేఖర్ కలిసి డాన్సు చేస్తే ఎలా వుంటుందో లైవ్ చూపిస్తాడనుకున్నా కానీ, నా అంచనాలను మారుస్తూ "నువ్వొస్తానంటే నేనొద్దంటానా"లో ఉప్పుతో చేసిన హల్వా తిన్న జయప్రకాష్ రెడ్డి లాగా ఫేస్ పెట్టి "మళ్లీ కిచెన్‌లో అడుగు పెడితే కాల్లు విరగ్గొడతానని" డిప్లొమాటిక్‌గా వార్నింగ్ ఇచ్చేసాడు.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)