నేను ఇంజినీరింగ్ మైసూర్ లో చేసాను. మా కాలేజీ ఊరి అవతల వుండేది. మేము వున్న లేఅవుట్ అప్పట్లో మైసూరు కు చివరి సెంటరు. ఆ ఏరియా దాటితే అంతా చెట్లు పుట్టలతో వుండేది. మా బ్యాచ్ లో 20 మందిమి తెలుగు వాళ్లం. రెండు ప్రైవేట్ హాస్టల్స్ లో అందరం వుండేవాళ్లం. ఆ 20 మందిలో ఎక్కువ మందికి ముందే హాస్టల్ జీవితం అలవాటు. నాలాంటి ఒక ఐదారుగురికి మాత్రం అది కొత్త.
రెండు విషయాల్లో మాత్రం అక్కడ అందరికీ కొత్తే. ఒకటి భాష అయితే రెండోది స్వాతంత్ర్యం. చాలా మంది ఇంటర్ హాస్టల్లో చదివినా కూడా అక్కడ ఎంత స్వాతంత్ర్యం వుంటుందో అందరికీ తెలిసిందే. ఈ రెండు విషయాలే మా అందరినీ బాగా దగ్గర చేసాయి. ఇంజినీరింగ్ అయిపోయి దాదాపు ఏడేళ్లు అయినా కూడా ఇప్పటికీ ఒక పది మందిమి రెగులర్ గా టచ్ లో వున్నాం. ఏ ఒకేషన్ వచ్చినా ఇప్పటికీ ఆ పది మందిమి మాత్రం తప్పకుండా కలుసుకుంటాం. అన్నీ ఒక వరుసలో కాకపోయినా, గత పదేళ్లలో మా మధ్య జరిగిన సరదా సంగతులు, మేం పంచుకున్న మధురానుభూతులు ఈ లేబుల్ కింద పోస్టు చేస్తాను.
సరదాగా సాగిన జీవితాన్ని మరింత సరదాగా గుర్తు చేసుకుందాం... మెల్లమెల్లగా, కొద్దికొద్దిగా.... కానీ మొత్తంగా!!!
నరేష్ గారు
రిప్లయితొలగించండిమీ బ్లాగు చాలా బావుంది
మీ బ్లాగు ని అగ్గ్రిగేటర్ లో రిజిస్టర్ చేసుకోవాల్సింది
ఇంత మంచి బ్లాగు మా అందరికీ పరిచయం అయ్యేది
తప్పకుండా చేస్తానండి. నాకు ముందు తెలీదు కానీ, నిన్ననే మీ బ్లాగ్‌లో అగ్గ్రిగేటర్ లిస్టు చూసాను. తొందరలోనే రిజిస్టర్ చేస్తాను.
రిప్లయితొలగించండి