నేను, మా రాజేష్ గాడు ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచీ రూమ్మేట్స్‌మి. మా రూం మేమున్న కాలనీలో ఒక మూలకి వుండేది. మేమందరం తినే మెస్సు సరిగ్గా అవతలి మూలకి వుండేది. మేము మెస్స్‌కి వెళ్లాలి అంటే మధ్యలో అన్ని రూములూ టచ్ చేసే ఒక సౌలభ్యం వుండేదన్నమాట. కాకపోతే అందరికీ రెండు అడ్డాలు వుండేవి. ఒకటి, మా రూముకి, మెస్సుకి మధ్యలో వుండే మా సూరీడు రూము. వాడి గురించి తెలియాలంటే ఇక్కడ చదవొచ్చు. రెండోది, బావబామ్మర్దుల రూము. (మా మిట్టి గాడు, సంతోష్ గాడూ ఇద్దరూ మైసూర్లో రూమ్మేట్సు. హైదరాబాద్ వస్తే బావబామ్మర్దులు. అందుకే ఆ రూంకి ఆ పేరు.) ఎవరి సౌకర్యం ప్రకారం వాళ్లు మెస్స్ టైముకి ఏదో ఒకచోటికి చేరేవాళ్లు. సూరీడు రూముకి చేరినవాళ్లు మెస్సుకి పోతూ పోతూ బావాబామ్మర్దుల రూములో వాళ్లని పోగేసుకుని పోగేసుకుని మెస్సుకి చేరేవాళ్లు. అలా అందరం కలిసి ఒకేసారి తినేవాళ్లం అన్నమాట.
ఒకసారి భొజనాల వేళకి నేను, మా రాజేష్ గాడు సూరీడు రూముకి చేరాం. అక్కడ అల్రెడీ మా కిరన్ గాడూ, సజోగ్ గాడు వున్నారు. సజోగ్ గాని సొంత ఊరు కేరళ. శురీడు రూముకి, మెస్సుకి మధ్య వాడి రూం వుండడం వల్ల, వానికి మా వాళ్ల లాగానే క్రికెట్ ఆడాలనే పిచ్చి వుండడం వల్ల, ఇంకా ఇతరత్రా చాలా కారణాల వల్ల వాడు మాతో ఎక్కువగా వుండేవాడు. మేము నలుగురం రూంలోపల కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నాం. బయట మిగిలినవాళ్లు కూడా ఎదో సొల్లు వేసుకుంటున్నారు. ఇంతలో మామధ్య టాపిక్ కేరళ సినిమాలవైపు వెళ్లింది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి. మా రాజెష్ గాడు, కిరన్ గాడు క్లాస్‌మేట్స్. వాళ్లకి సుబి అని ఒక కేరళ క్లాస్మేట్ వుండేవాడు. మా కెరళ సినిమాల టాపిక్‌లో రాజేష్ గానికి ఎప్పుడో ఎదో సందర్భంలో ఆ సుబి గాడు చెప్పిన మాట అన్నడు. అది - "కేరళలో కొన్ని ఏరియాల్లో షకీలా సినిమాలకి ఇంట్లో వున్న మగాళ్లందరూ కలిసి వెళతారు" అని. అంటె, తండ్రీ కొడుకులు, అన్నాతమ్ములూ అలాగంట. వాడు ఆ విషయం పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చెయ్యగానే, స్వతహాగ నాకున్న ఉత్సాహం, ఆవేశం చంపుకోలేక వున్నపళంగా సజోగ్ గాని వైపు తిరిగి "క్యారే సజోగ్, తుం ఔర్ తుమారే పాపా భి ఐసే జాతే క్యా?" అని అడిగేసా. (అంటే తెలుగులో, నువ్వు, మీ నాన్న కలిసి అలాంటి సినిమాలకు వెళతారా అని). పాపం వానికి ఎమనాలో అర్థం కాలేదు. అర నిమిషం పాటు వానికే కాదు, పక్కనున్న ఇద్దరికీ కూడా అర్థం కాలేదు, నా ప్రశ్నకి ఎలా రియాక్ట్ కావాలో. నేనేమో సీరియస్‌గా ప్రశ్నేసి వాడి ఆన్సర్ కోసం వాని వైపే చూస్తున్నా. వాడు ఒక నిమిషం తర్వాత షాక్ నుంచి తేరుకుని "పోరా, అడగడానికి ఇంకేమి దొరకలేదా... ఆకలేస్తోంది, మెస్సుకెళ్దాం పదా" అని హిందీలో చెప్పి బయటికి నడిచాడు. వాని వెనకే మేము కూడా. అప్పట్లో నేనెంత అమాయకంగా వుండెవాన్నంటే, ఆ క్వెశ్చన్‌లో ఎలాంటి మీనింగ్ వుంది అన్నది, రాత్రికి మా రాజేష్ గాడు చెప్పేవరకు అర్థం కాలేదు.
ఇది జరిగిన కొన్ని రోజులకే... పరీక్షల వేళ. ఒకరోజు డిన్నర్ తర్వాత, మర్నాడు ఎవరికి ఎగ్జాం లేకపోవడంతో అందరం కలిసి బావాబామ్మర్దుల రూములో కూర్చుని, పడుకొని, వాలిపోయి.... అలా ఎవరికి నచ్చిన పొసిషన్ ఆండ్ ఆంగిల్లో సెటిల్ అయిపోయి సొల్లేసుకుంటున్నాం. తొందరలో ఇంటికి వెళ్లాలి కాబట్టి ఎవరెవరు ఎలా వెళ్దాం అని అక్కడ డిస్కషన్ పాయింట్. మా రాజేషు గాడికి బతుకంతా బస్సు ప్రయాణాలతో గడిచిపోయింది. దాంతో వాడు ఎప్పుడు బెంగుళూర్ దాకా ట్రెయిన్‌లో వెళ్లడానికే ఇష్టపడేవాడు. ఆరోజు డిస్కషన్‌లో కూడా వాడు ట్రెయిన్‌లో పోవాలని అన్నాడూ, ఆస్ యూసువల్‌గా. కాకపోతే అందరం బయలుదేరదామనుకున్నరోజు ఒకరిద్దరికి పొద్దున ఒక పరీక్ష వున్నందువల్లనూ, వాళ్లిద్దరూ హైదరాబాద్ వాళ్లవడం వల్ల, హైదరాబాద్ వెళ్లేవాల్లందరం రెండు గంటల బస్సుకి బయలుదేరాలి అనుకున్నాం. మిగిలినవాళ్లందరూ ట్రెయిన్‌లో వెళ్లాలని ప్లన్ చేసారు. అసలు ఎలా వేళ్లినా మళ్లీ అందరం మజెస్టిక్‌లో కలుసుకోవాల్సినవాళ్లమే. ఎందుకంటే, అందరికీ అక్కడినుంచే వాళ్ల వాళ్ల వూరికి బస్సో, ట్రెయినో పట్టుకునేవారు. ఏరకంగా చూసినా, అప్పట్లో హైదరాబాదుకే ముందు బయలుదేరేవి.
ఈ ప్లాన్ అంతా ముగిసాక, యే ట్రెయినుకు వెళ్లాలి? బెంగళూరు చేరాక రాత్రి బస్సు టైము వరకు ఏమి చేయాలి అని మొదలైంది. అంతా కలిసి టిపు ఎక్స్‌ప్రెస్‌కి బయలుదేరి వెళ్లాలి అనుకున్నారు. మొదట్లో అది 11.20 కి మైసూరులో బయలుదేరి 2.40 కి బెంగళూరుకి వచ్చేది. ఈ డిస్కషన్ జరగడానికి కొన్ని రోజులముందే ఇండియన్ రైల్వేస్ వారు టైంటేబుల్ మార్చారని పేపర్లో చదివా. నాకేమో పేపర్ పట్టుకుంటే ఒక గంటపాటు దాన్నిఆసాంతం చదివే అలవాటు. మా వాళ్లకి ఇంగ్లిష్ పేపర్ ఇస్తే ఫస్ట్ పేజీ, స్పోర్ట్‌పేజీ తప్ప వేరే ఏ పేజీలకు వెళ్లే ఓపిక లేదు. సరిగ్గా అదే ఆలోచించి, మనవాళ్లకి విషయం తెలుసో లేదో అని అందరినీ ఉద్దేశిస్తూ చెప్పా - "టిపు ఎక్స్‌ప్రెస్ టైము మారిందిరా. ఇప్పుడది 11కే బయలుదేరుతుందీ" అని. అప్పటివరకూ సైలెంటుగా వున్న బక్క రవిగాడు ఒక్కసారిగా లేచి నీకిప్పుడు తెలుసా, మాకందరికీ ఎప్పుడో తెలుసు అని గట్టిగా అని నవ్వేసాడు. కానీ, నాకెందుకో అప్పటికి డౌటు వుండేది. వీళ్లకి త్యాఎలీదు అని. కానీ వాని మాటతో అందరూ ఒక్కసారిగా పెద్దపెట్టున నవ్వేసారు. నాకు కాలింది. సరెలే, పిల్లలు తర్వాత ప్రాబ్లెం ఫేస్ చెయ్యకూడదు అని చెప్తే నన్నే గేలి చేస్తారా అని అవేశంగా అడిగేద్దామని రెడీ అయ్యా. మెదడుకు ఆలోచనైతే వచ్చింది కానీ నోటికి ఆవేశం రాలేదు. ఆ క్షణానికి సైలెంటుగా కుమిలిపోయా.
ఇంకో వారం తిరిగేసరికి అందరం ఇంటికి వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది. ఎలాగూ వెళ్లేది మధ్యాహ్నం బస్సుకు కదా అని కాస్త బద్దకంగానే వున్నా. నా రూమ్మేటైన రాజేష్ గాడు మాత్రం లేచి బ్యాగ్ సర్దుకుని రెడీ అవుతున్నాడు. టైం చూస్తే ఇంక తొమ్మిది కూడా కాలేదు. అప్పట్లో మేమున్న కాలనీ నుంచి రైల్వే స్టేషన్ కి వెళ్లడానికి 20 నిమిషాలు పట్టేది. "ఎందుకురా అంత కంగారు, ఇంకా చాలాటైం వుంది కదా" అన్నా నేను వానితో. నేను రెడీ కావడం కాదురా, ఇంక మిగిలిన వాళ్లు రెడీ అయ్యారో లేదో చూడాలి. అందుకే రెడీ అయ్యి మనవాళ్ల రూములమీద పడితే అందరినీ టైముకల్లా రెడీ చేయొచ్చు అని చెప్పి భుజానికి బ్యాగ్ తగిలించుకుని బయలుదేరాడు. హ్యాప్పీ జర్నీ చెప్పి తలుపేసుకుని మళ్లీ ముసుగు తన్నేసా. పదింటప్పుడు ఎందుకో తెలివైంది. లేచి పేపర్ చదువుతూ రెడీ అవుతున్నా. రెడీ అవుతూ పేపర్ కూడా చదువుతున్నా. పదిన్నర దాటి పావుగంట అయ్యాక రాజేష్‌గాడు మళ్లీ వచ్చాడు. ఏరా అంటే "అందరూ ఇప్పుడే రెడీ అయ్యారురా. నేను జెర్కిన్ మరిచిపోయా, అది తీసుకెల్దామని వచ్చా"నన్నాడు. ఇంక స్టేషనుకెప్పుడెళ్తార్రా? అని ఆదిగితే ఇంకా అరగంట పైనే టైముంది కదరా, చేరిపోతాములే అన్నాడు. అప్పుడు నేను పేల్చా ఒక న్యూక్లియర్ బాంబ్. అంత టైమెక్కడుందిరా, ట్రెయిన్ 11కే జంపుజిలానీ కదా అని చెప్పా. పాపం, వానికి ఏం చెయ్యాలో, ఏం చెప్పాలో అర్థం కాలేదు.
వాడు షాక్‌నుంచి తేరుకోడానికి రెండు నిమిషాలు పట్టింది. ఆ తర్వాత మా ఇద్దరిమధ్యా చిన్న వాగ్యుద్దం కూడా నడిచింది. ట్రైన్ టైం మారింది అని తెలిసినప్పుడు ఎందుకు చెప్పలేదురా అని వాడు, మొన్న చెబితే తెలుసు అని చెప్పారు కదరా, మళ్లీ మళ్లీ ఎందుకు చెప్పాలిరా అని నేను. చివరికి అందరం కలిసి రెండు గంటల బస్సుకి బయలుదేరాం.
ఇప్పుడు చెప్పండి, ఇందులో నా తప్పేమైనా వుందా...? కానీ ఇప్పటికీ మా బ్యాచు వాళ్లు మాత్రం ఛాన్సు దొరికినప్పుడల్లా, ఇది గుర్తొచ్చినప్పుడల్లా ఆరోజు అందరూ నన్ను టీజ్ చేసిన దానికి ప్రతీకారంగా చివరినిమిషం వరకూ ఆగి అప్పుడు టైం టేబుల్ మారిందని చెప్పానని మళ్లీ మళ్లీ డిసైడ్ అయిపోతున్నారు. కనీసం నా వాదన వినిపించే చాన్సు కూడా ఇవ్వట్లేదు :'(
ఇది నా జీవితం. మెల్లిమెల్లిగా నా స్వగతాన్ని, దానితో పాటు జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు, వచ్చే ఆలోచనలూ... అన్నీ ఇందులో వుంటాయి, వస్తాయి.
05 జులై, 2010
28 జూన్, 2010
మరో ఆక్సిడెంట్....!!!
అనగా అనగా 2008వ సంవత్సరం జూలై మాసంలో, మా ఆఫీసులో బ్యూటీ కాంటెస్ట్ గెలిచిన తెలుగమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్టు కల కంటూ నిద్రపోతున్న ఒకానొక ఉదయం నాన్న ఫోను చేసి నిద్ర లేపి "ఈ వేకెండ్లో ఇంటికి వచ్చి అఘోరించ"మని ఆర్డర్ పాస్ చేసాడు. సరే అని చెప్పి మళ్లీ ముసుగుతన్నా. నిద్ర లేచేసరికి అఫీసుకు టైమవుతోందనే ధ్యాసే తప్ప నాన్న ఫోన్ చేసిన విషయం అసలు గుర్తే లేదు. షరామామూలుగా ఆఫీసు టైముకి ఒక గంటలేటుగా చేరుకున్నా. పార్కింగ్ దగ్గర నాలాంటి బద్దక బ్రహ్మచారులు చాలామంది ఎదురయ్యారు. అందరం కలిసి లిఫ్ట్‌లో వుండగా ఒకడు అడిగాడు, ఈ వీకెండ్‌లో సినిమాకెళదామా అని . అప్పుడు గుర్తొచ్చింది పొద్దున ఫోనొచ్చిన విషయం. లేదురా, ఇంటికెళ్తున్నా అని చెప్పా. ఆఫీసుకెళ్లిన కాసేపటికే వాడు పింగ్ చేసి మన కంపనీలో కొత్తగా చేరిన పట్నం పోరడు గూడా ఇంటికొస్తుండంటా... ఇద్దరు కలిసి పొండ్రా అని చెప్పాడు. ఆ పట్నం పోరడు నా కోసం వెళ్లేప్పుడు గరీబ్ రథ్ కి తత్కాల్ టికెట్టు తీసాడు. తిరుగు ప్రయాణానికి మాత్రం ట్రెయిన్ టికెట్టు దొరకలేదు. నేను చాలా సార్లు వచ్చా, ధనుంజయ ట్రావెల్సు వాడి సర్వీసు బాగుంటుంది అంటూ అందులో టికెట్టు బుక్ చేసాడు. ఏసిలో చల్లగా పడుకొని క్షేమంగా ఇంటికి చేరాం.
తిరుగు ప్రయాణానికి బస్ టైముకి ఒక పావుగంట ముందు లక్డీకాపూల్ కి చేరుకున్నా. అప్పటికే నా కొలీగు నాకోసం వెయిటింగు. ఏంటి అంటే ధనుంజయ వాడి బస్సు పాడయిందని వేరే బస్సులో టికెట్టిచ్చాడు. వాడే టికెట్టిస్తూ ఆ ట్రావెల్సు ఆఫీసుకి దారి చెప్పాడు. అక్కడికి వెళ్లే సరికి బస్సు రెడీగా వుంది. దాహం వేస్తుంటే వెళ్లి వాటర్ బాటిలు కొందామనుకున్నా. కానీ ఎందుకో ఆ టైములో నా మట్టి బుర్ర పాదరసంలా పనిచేసింది. బస్సెక్కాక వాడు ఎలాగూ ఒకటిస్తాడు కదా అని ఆగిపొయ్యా. బస్సు బయలుదేరగానే బాటిలెప్పుడిస్తాడా అని ఎదురు చూస్తూ కూర్చున్నా. బస్సులో ఆస్తి పంపకాలు చేస్తున్నంత జాగ్రత్తగా సప్లై చేసుకుంటూ వస్తూంటే నా ప్రాణం లేచొచ్చినట్టయ్యింది. ఎలాగైతేనేం, నీళ్లు తాగేసా. ఇంతలో మళ్లీ ఆస్తి పంపకాలు మొదలయ్యాయి. చుస్తే వాడు చేతిలో ఒక కుర్కురే పాకెట్టు, ఒక గుడ్‌డే బిస్కెట్ పాకెట్టు పెట్టి వెళ్లిపోయాడు. అంతే, మనసులో "ధబ్"మని ఒక సౌండ్ వినిపించింది. యెస్... నేను వాడి సర్వీసుకి పడిపొయ్యా.
బస్సు దిగుతూనే బస్సు మీద పేరు చూసా. HKB టూర్స్ అని వుంది. మైండ్‌లో సెట్ అయిపోయింది. ఇక మొదలు... గత రెండు సంవత్సరాలుగా వాడిచ్చే చిప్స్ ప్యాకెట్టు, బిస్కెట్ ప్యాకెట్టులకు కక్కుర్తి పడి ఇంటికి వెళ్లిన ప్రతీసారీ అదే బస్సుకి రావడం మొదలుపెట్టా. ఎంతలా అంటే రిటర్న్ టికెట్ బుక్ చేయమని మా తమ్మునికి చెప్పిన ప్రతీసారీ వాడు దైరెక్టుగా ఆ ట్రావెల్సుకి పోయి బుక్ చేస్తాడు.
పోయిన వీకెండ్‌లో ఇంటికి వెళ్లేపుడు మా తమ్మునికి టికెట్ బుక్ చేయమని చెప్పినప్పుడు ఎందుకో ఎదో తేడా కొడుతున్నట్టనిపించింది. ఎప్పుడూ లేనిది, బస్సులో చిట్టచివరి సీటు దొరికింది. ఏవో కొన్ని అపశకునాల మధ్య బస్సెక్కా. తొమ్మిదింటి బస్సు తొమ్మిదిన్నర కి బయలుదేరింది. ఎప్పుడూ లేనిది ఇలా లేట్‌గా స్టార్ట్ అయినప్పుడు ఇంకేదో తేడా అనిపించింది. కానీ వాడు వేసిన రంగ్‌దే బసంతి సినిమా ఆ ఆలోచనలని దగ్గరికి రానివ్వలేదు. సినిమా అయిపోయాక కిటికీలోంచి పక్కకి చూస్తే, బస్సు జడ్చర్ల దాటింది. రోడ్డు సూపర్‌గా వుంది. బస్సు మూడంకెల స్పీడుతో పరుగెడుతోంది. ఆహా!!! చిన్న కుదుపు కూడా లేకుండా ప్రయాణం సుఖంగా వుంది. సింబాలిగ్గా "గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే" అంటూ పాట వినిపిస్తోంటే నిద్రలోకి వెళ్లిపోయా. లేని అలవాటు.... మధ్యలో తెలివైంది. టైము చూద్దామనిఫోను తీస్తే స్విచ్చాఫ్ అయ్యింది. సరె అనుకొని మల్లి అలా నిద్రలోకి జారుకుంటున్నా. అంతలోనే పెద్ద కుదుపు... ఏమిజరిగిందో తెలిసేలోపల ఒక నాలుగైదు సార్లు ఎగిరి పైన లగ్గేజ్ షీల్డ్‌కి తగిలి కింద పడ్డా. సడ్డెన్‌గా బస్సు ఆగిపోయింది. రెండు నిమిషాలు సైలెంటుగా వున్నా. తల పైన అన్ని సార్లు తగలడంతో మైండ్ బ్లాకై, రెడ్డై, పింకై, బ్లూ అయి, మల్లీ నార్మల్‌కి వచ్చేసరికి రెండు నిమిషాలు పట్టింది మరి. ఆ రెండు నిమిషాలు గడిచాక విషయం అర్థం అయ్యింది.
వెంటనే నాలో ఆవేశం ఉప్పొంగింది... " దీంతల్లి... దేత్తడి పోచమ్మ గుడి... ఎవడ్రా ఆ డ్రైవర్‌గాడరోయ్...!!!" అంటూ అవేశంగా లేచా. లేచిన మరుక్షణం నా ఆవేశం చల్లారిపోయింది. ఎందుకంటే, మూడూ సీట్ల ముందు నిలుచున్నవాడు మసకగా కనిపించాడు... ఇంక డ్రైవర్ గాడేమి కనిపిస్తాడు నా బొంద. కానీ, అప్పటికే నాలో నిద్రపోతున్న మేధావి చటుక్కున లేచేసాడు. అతడు సినిమాలో ప్రకష్ రాజ్ లాగా ఇన్వెస్టిగేట్ చెయ్యడం మొదలుపెట్టాడు. అప్పుడు తెలిసింది... ఒకటి, నా కళ్లద్దాలు మిస్సింగ్. రెండు, నా ముందున్న సీట్లన్నీ నాకంటే ఒకమెట్టు కింద వుండాలి. కానీ అందరూ మూడూ సీట్ల ముందున్న వాడు మూడు మెట్ళ కిందున్నాట్టు కనిపించాడు... అంటే, బస్సు రోడ్డు మీడ లేదు. ( నా బొంద, బస్సు రోడ్డు మీద వుంటే, ఇన్ని కష్టాలు ఎందుకు??) మూడూ, రోడ్డు మీద పోతున్న వెహికిల్స్ అన్నీ మా కంటే ఎత్తులో వున్నాయి... అంటే, రోడ్డు పక్కన గుంతలో వున్నా. ఎవరికి వారు అద్దాలు పగలగొట్టాలని చూస్తున్నారు. కొందరు ఇంకా షాక్ నుంచి తేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కుదుపులకి సీట్లల్లోంచి ఎగిరి కింద పడ్డవారు ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో చూసుకుంటున్నారు. అసలెక్కడున్నామా అని చుట్టూ చూసా. కొంత దూరంలో రైలు వెళుతూ కనిపింది... అంటే పెనుగొండ దగ్గర్లో వున్నా అని అర్థం అయ్యింది. అంతసేపు, కిటికీలోంచి బయటకు పైకి చూసిన నేను ఒక్కసారిగా కిందకి చూసి షాక్ అయ్యా. పక్కనే పెద్ద కుంట. ఏ కొంచం తేడా జరిగినా బస్సు ఆ కుంట లో పడి మునిగేది. అంటే, బస్సులోంచి చూసినప్పుడు నాకు కుంట గురించి పెద్దగా తెలీలేదు... కాని పోలిసులొచ్చి బస్సు దించాక వాళ్లు ఎలా జరిగిందో ఇన్వెస్టిగేట్ చేసేప్పుడూ పక్క కుంట చూపించి చెప్పారు... అందులో పదుంటే బస్సు మునిగేది, ఎవరూ బతికేవారు కాదూ అని.
బెంగుళూరుకొచ్చాక అక్సిడెంటు గురించి మొత్తం మా రాజేష్ గాడికి చెప్పా. ఎలా జరిగింది, చుట్టు పక్కల పరిస్థితి.. అంతా చెప్పాక వాడన్నాడు, అంత మందిలో ఎవడో ఒక్కడు మంచి అదృష్టవంతుడు రా.. ఆ అదృష్టమే మిమ్మల్నందరినీ కాపాడిందీ అని. నాకు కూడా నిజమే అనిపించింది... ఆ అదృష్టవంతుడెవరో నాకు తెలీదు, కానీ ఆ బస్సే ఎక్కినందుకు, తెలిస్తే వెళ్లి ఒక పెద్ద థాంక్స్ చెప్పి ఫుల్ బాటిల్ మందు, అంచుకోడానికి తందూరి, డిన్నర్ కి బిర్యాని స్పాన్సర్ చేసేవాన్ని. కావాలంటే బెన్సన్ & హెడ్జెస్ సిగరెట్లు కూడా. ఆ అదృష్టవంతుడెవరో తెలిస్తే కాస్త చెప్పండీ ప్లీజ్.

04 జూన్, 2010
ఇల్లు కట్టనక్కర్లేదు... కష్టాలు తెలియడానికి!!!
ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారంట పెద్దలు... వాళ్లెవరో నాకు తెలీదు. తెలిసుంటే, వాళ్లని నా తమ్మునికి అప్పజెప్పేవాన్ని. ఎందుకంటారా...
ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం చాలా కష్టంతో కూడుకున్న పనులని పెద్దోళ్లు చెప్పిన సామెత అర్థం. కాని, కష్టం రుచి చూడడానికి ఇల్లు కట్టనక్కరలేదని, కట్టిన ఇల్లు కొన్నా చాలని ఈ నెల రోజుల జీవితం కొత్త పాఠం నేర్పింది. పొద్దున్నే కొత్త ఇంటిదగ్గరికి వెళ్లి పని ఎలా నడుస్తుందో చూడటం, పని వాళ్లకు ఏమేమి కావాలో అవన్నీ ఇప్పించటం, దగ్గరుండి చేయించటం, ఆఫీసుకి వెళ్లిరావటం, మళ్లీ రాత్రికి ఇంట్లో పని వాళ్లతో పని చేయించడం... గత నెలరోజులుగ ఇదే పని. అందుకే అన్నాను... ఇల్లు కట్టక్కర్లేదు... కొంటే చాలు. ఇంటీరియర్సు చేయించడానికే ఇంత కష్టమయితే, ఇంక ప్లాటు కొని, ఇల్లు కట్టించాలంటే... అమ్మో, మా తమ్ముడు నన్ను చంపేసేవాడు. ఎందుకంటే, పైన చెప్పిన పనులన్నీ నేను చూసా. వాడు చేసాడు, చేయించాడు. మనకున్న బద్దకానికి, సోమరితనానికి (ఈ రెండింటిలో ఎదో తేడా వున్నట్టు!!!) వాడు నెలలో చేయించినపని నేను చేయించాలంటే కనీసం ఒక త్రైమాసికం పట్టేది. సరె, పడితే పట్టింది కానీ, పనిలో క్వాలిటీ మాత్రం వాడిపనిలా వుండేదికాదు. చాలా తక్కువగా వుండేది.
ఎదైతేనేం, మొత్తానికి గృహప్రవేశం జరిగిపోయింది. దీనివల్ల నేను నేర్చుకున్న ఇంకొక పాఠం ఏమిటంటే, గృహప్రవేశం అనుకున్నంత వీజీ కాదు. అయినా, గృహప్రవేశాలకి తెల్లవారుఝాము ముహూర్తాలే ఎందుకు వస్తాయో... :'(

18 మే, 2010
అనుకోని యాత్ర - ఊటీ
మేము ఇంజినీరింగ్‌లో చేరాక, ఫస్ట్ సెమిస్టర్‌లోనే కొందరికి బండ్లు వచ్చాయి. సెకండ్ సెమిస్టర్‌కి వచ్చేసరికి బండ్లు పెరిగాయి. అదిగో, అప్పుడు అనుకున్నాం... అందరం కలిసి ఒకసారి బండ్లమీద ఊటీ వెళ్లి వద్దాం అని. అలా అనుకుంటూనే రోజులు గడిచిపోయాయి. రోజులు నెలలు, నెలలు ఏళ్లు అయ్యాయి. రెండేళ్లు గడిచాక, ఒక హోళీనాడు అందరం సరదాగా హోళీ ఆడుకున్నాం. ఏం సరదానో ఏమో, హోళీ అన్న విషయం మరిచిపోయి పొద్దెక్కేదాకా పడుకున్నందుకు, లేపుకొచ్చి నెత్తి మీద గుడ్డు కొట్టి కిందనుంచి మన్ను తీసి పోసారు... దుమ్మంతా తలలోంచి పోవడానికి గంట కష్టపడి మూడు శాంపూ సాచెట్లు అరగదీస్తే కానీ దారికి రాలేదు. అది పక్కన పెడితే, అలా ఆడుకుని స్నానాలు అయ్యాక అందరం కలిసి లంచ్ కి వెళ్లేముందు అలవాటు ప్రకారం ఒకచోట కలుసుకున్నాం. అక్కడినుంచి మెస్‌కి పోతుండగా ఎవడో అన్నాడు.. ఎటైనా ట్రిప్ వేద్దామురా అని... అక్కడ మొదలైంది, మా పరిశోధన. భోంచేసి వచ్చి అందరం కలిసి ఒక గ్రూప్ డిస్కషన్ పెట్టుకున్నాం, ఎక్కడికి వెళ్దాం అని. మొదలు మైసూరుకు 80 కిలోమీటర్ల దూరంలో వున్న గోపాలస్వామి బిట్ట అనుకున్నాం. చూస్తే మంది ఎక్కువ, బండ్లు తక్కువ వున్నాయి. సరే, కొందరు ఏ సుమోనో క్వాలిసో మాట్లాడుకుని పోతే సరిపోద్ది అనుకున్నాం. అంతలో మా రూమ్మేటు కొందరు బండ్లమీద, ఇంకొందరు కార్లో పోవడం ఏంటి, పోతే అందరం ఏ స్వరాజ్ మజ్దానో పట్టుకుపోతే సరిపోద్ది కదా అన్నాడు. ఆ పెద్ద బండేదో మట్లాడుకునేటట్టయితే, ఈ బిట్ట దాకానే ఎందుకు, ఇంకొచం ముందుకు పొయ్యొద్దాం అనుకున్నాం. అలా ప్లాన్ చేసి, మరుసటి రోజు పొద్దున్నే అందరం కలిసి ఊటీ, కొడైకనాల్ చూసొద్దామని బయలుదేరాం.
మాకు దొరికిన డ్రైవర్ పేరు మైఖేల్ షుమేకర్ (అది మేము పెట్టిన పేరు). వాడు పొద్దున మైసూర్‌నుండి బయలుదేరి, 135 కిలోమీటర్ల దూరంలో వున్న ఊటీ కి తీసుకెళ్లడానికి 6 గంటల పైనే తీసుకున్నాడు. టైం తీసుకున్నాకూడా ఆ జర్నీని మేము బాగా ఎంజాయ్ చేసాం. ఎప్పుడో చూసిన తిరుపతి ఘాట్‌రోడ్డు, ఎప్పుడూ తిరిగిన చాముండి బిట్ట రోడ్డు తప్ప పెద్దగా ఘాట్‌రోడ్డులు తెలీని మాకు, ఒక్కసారిగా అంతపెద్ద కొండలు, మలుపులు తిరుగుతూ వెళ్లే రొడ్డు, దానికి తోడు చుట్టూ టీ తోటలు.. స్వర్గం కల్లముందు వున్నట్టు అనిపించింది. అలా ఎంజాయ్ చేస్తూ డైరెక్టుగా ఊటీలో దొడ్డబిట్ట కి వెళ్లిపోయాం. అక్కడ చూస్తే ఏముంది... మేఘాల పైన మేమున్నాం. గాళ్లో తేలిపోవడమంటే ఇదేనేమో అనిపించింది. దానికి తోడు, అప్పుడు అక్కడ చిన్నగా వాన, చలి. మొదలు చూస్తే అక్కడంతా ఫ్రెష్ క్యారట్, మసాలా అద్దిన శెనగలు గట్రా అమ్ముతున్న కౌంటర్లు కనిపించాయి. కానీ, టికెట్టు కొని పీక్‌పాయింటు చూద్దామని వెళ్తే అక్కడ ఒకడు చాకోబార్‌లు అమ్ముతున్నాడు. ముందు వాన్ని చూసి, ఇక్కడ ఐస్‌క్రీములెవడు తింటాడురా పిచ్చిప్యూన్ అనుకున్నా. విధి వక్రించి ఎవడో తింటూ కనిపించాడు. జిహ్వచాపల్యం వూరుకుంటుందా, నాకూ కావాలని గోల చేసింది. తప్పదనుకొని కొన్నా. ఆ చలిలో ఆ చాకోబార్... కేక. ఇప్పటికీ ఎవరైనా ఊటీ వెళ్తున్నామని చెప్తే వాళ్లకి నేను దొడ్డబిట్ట దగ్గర చాకోబార్ తినమని సలహా ఇస్తా. అంతలా నచ్చింది. దొడ్డబిట్ట తర్వాత ఊటీలో పెద్దగా పొడిచిందేమీ లేదు గానీ, ఆరోజు సాయంత్రం ఊటీ నుంచి కూనూర్ వరకూ టాయ్‌ట్రెయిన్‌లో ప్రయాణం మాత్రం అద్భుతం. ఆ తరువాత నేను ఊటీకి వెళ్లిన ప్రతీసారీ ఆ టాయ్‌ట్రెయిన్ ప్రయాణం చేస్తూనేవున్నా.
కూనూర్‌లో దిగాక మా మొదటి పని, రూము వెతుక్కోవడం. రూం వెతుక్కోవడం అనే కార్యక్రమం పూర్తి అయ్యేలోపే మా వాళ్లు అసలు కార్యక్రమానికి ప్రిపేర్ అయ్యారు. అదేదో రూం కోసమే ఆగినట్టుగా, దొరికేసరికి చేతిలో కవర్లు పట్టుకొని సిద్దంగా వున్నారు. ఎనిమిదింటికి రూములోకి వెళితే, ఎనిమిది అయిదుకి గ్లాసులు నింపి సిద్దమయ్యాం. కాకపోతే, మాకు అక్కడికి, మైసూరుకి పెద్ద తేడా తెలీలేదు. మామూలుగానే అనిపించింది. ఇక ఆ మర్నాడు కూనూరు చూసుకుని కొడైకనాల్ బయలుదేరాం. దార్లోనే కదా అని మధ్యలో పళని గుడి కూడా చూసేసాం. పళని అంగానే మాకందరికి గుర్తొచ్చే విశయం ఒకటుంది. దానికి ఆద్యం మాకున్న ఒక గొప్ప ఫ్రెండు. పేరు - కిరణ్ అలియాస్ . నిజం చెప్పొద్దూ, వీడు మన తోటరాముడు గారి దినకర్ కి కజిన్ బ్రదర్. తమిళనాడు బార్డర్ కి పక్కనే వున్న వూర్లో పుట్టి పెరగడం మూలాన నాకు తమిళ్ వచ్చు అని చెప్పేవాడు. దార్లో పళనిలో ఆగిదాం అని చెప్పగానే వాడు చెప్పాడు... నేను ఇదివరకు వెళ్లాను, కొండ పైవరకు రోడ్డు వుంటుంది, బండి నేరుగా గుడి ముఖద్వారం ముందు ఆగుతుంది అని చాలా చెప్పాడు. గుడి గురించి ముందు చెప్పినవాడు కొండ పైకి నడిచి వెళ్లాలి అని చెప్పినప్పుడు పుట్టిన కంగారు వాని మాటలతో దూరం అయ్యింది కూడా.
గుడిదాకా వెళ్లాక కానీ మాకు అర్థం కాలేదు. తీరా వెళ్లి చూస్తే అక్కడ కొండపైకి వున్నది రోడ్డు కాదు... రోప్‌వే. వాడు వెళ్లి ఎవరితోనో మాట్లాడి వచ్చి నదిచి ఎక్కితే మూడు గంటలు పడుతుందంట అన్నాడు. కొండ చూస్తే చిన్నగా వుంది, ట్రై చేద్దాం అని నడిస్తే ఎక్కడానికి 30 నిమిషాలు పట్టింది. ఎమైతేనేం, దర్శనం అయ్యింది. ఆరోజు సాయంత్రం ఆరుగంటలప్పుడు కొడై చేరుకున్నాం. నాకైతే ఊటీ కంటే కొడై బాగా నచ్చింది. రూములు తీస్కొని ఫ్రెషాయ్యక వెళ్లి వూరిమీద పడ్డాం. అక్కడికి మాకేదో అక్కడ ఆ టైంలో ఏదో చూసేద్దామని గుల పుట్టి కాదు కానీ, మా పని మీద మేము వెళ్లాం(ఆ పనేంటో అర్థం అయినవాళ్లు యువతరం కింద లెఖ్ఖ). అదేంటో, కొడై బస్టాండుకి మూడు దిక్కులా ఒక అరకిలోమీటరు వెళ్లాం. కనిపించిన ప్రతీ షాపులో అడిగాం. కూల్‌డ్రింకు కావాలి అంటే ఒక్కనిదగ్గరా ఫ్రిజ్జు లేదు. ప్రతీవాడూ అదేదో చిప్స్ పాకెట్ ఇచ్చినట్టు కబ్బొర్డులోంచి తీసిస్తున్నాడు. ఇప్పుడేం చెయ్యాలా అని మేమందరం ఒక షాపు ముందు నుల్చుని మా అంతర్జాతీయ మహాసభ నిర్వహిస్తూంటే ఇదంతా పక్కన వుండి అబ్సర్వ్ చేస్తున్న ఒకాయన మమ్మల్ని పిలిచి తెలుగులో మాకు అక్కడి వాతావరణం గురించి ఒక ఐదు నిమిషాలు క్లాసుపీకి, ఇది నాచ్యురల్ కోల్డు, మీకు పనికి వస్తుంది, ఇక్కడ హీటర్లే కానీ ఫ్రిజ్జులు వాడరు అని చెప్పి పంపాడు. కూనూర్‌లో కంటే కొడైలో ఆ రాత్రి మేము బాగా ఎంజాయ్ చేసాం.
ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. నాకు తెల్లవారుఝామున వచ్చిన కలలన్నీ నిజం అవుతుంటాయి. కానీ అదేంటో, అలా ఏదైనా కల వచ్చినప్పుడు లేవాగానే అనుకుంటా... ఇది జరిగే ఛాన్స్ లేదు అనో, లేకపోతే నిజ జీవితంలో ఇది జరగకుండా చూసుకోవాలి అనో... కానీ అది జరిగేవరకూ మళ్లీ అది గుర్తుకురాదు. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, నాకు ఊటీ వెళ్లడానికి ఒక రెండు నెలల ముందు ఒక కల వచ్చింది. అందులో మా బ్యాచ్ అంతా వున్నాం. అందరం గంటకు 10 రూపాయల అద్దె పెట్టి సైకిల్లు అద్దెకి తీసుకున్నట్టు. లేవగానే అనుకున్నా... ఇండియాలో గంటకి 10 రూపాయల అద్దెతో సైకిల్ తీసుకునే రేటు రావడానికి ఇంక చాలారోజులు పడుతుంది... అయినా నా రూమ్మేటు(మా బ్యాచులో, కలలో వాడు కూడా వున్నాడు కదా) సైకిలు రెంటుకి తీసుకుని తొక్కే సీనే లేదు అని. కానీ, మా వూరి వాగులో నీరు లేదు, నా ఆలోచనలో అర్థం లేదు. నా తెల్లవారుఝాము కలని నిజం కాకుండా ఆపే ధైర్యం ప్రకృతి చేయలేకపోయింది. అక్కడ ఒక లేక్ వుంది. దాని చుట్టు అందమైన రోడ్ వుంది. ఆ రోడ్ మీద సైకిలేసుకుని తిరగడం కూడా ఒక అనుభవమే. అందరూ ఆ అనుభవాన్ని అస్వాదించాలని, కొందరు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు(????) అక్కడ ఆ రోజుల్లో గంటకు పది రూపాయల అద్దెపై ఇచ్చేవారు. ఇంకేముంది... "కల నిజమాయెగా, సైకిల్ నేను తొక్కగా" అని పాడేసుకుంటూ అందరం సైకిల్ తొక్కేసాం. మొత్తం ట్రిప్‌లో నేను అన్నిటికంటే ఎక్కువగా ఎంజాయ్ చేసిన ఘట్టం ఈ గంటన్నర సేపే.
అదేంటో, రిటర్న్‌జర్నీలో మా షుమేకర్‌కి మాంఛి మూడ్ వచ్చినట్టుంది... ఒంట్లో వున్న ఎనర్జీనతా కాల్లల్లోకి తెచ్చుకొని అక్సిలరేటర్ తెగ తొక్కేసాడు. ఏముంది... తెల్లారేసరికి మళ్లీ మైసూరులోకొచ్చి పడ్డాం. కానీ కమర్షియలైజేషన్ వల్ల సంభవించే పరిణామాలు ఎలా వుంటాయో నాకప్పుడు తెలిసింది. ఊటీ కమర్షియల్‌గా అభివ్రుద్ది చెందింది... ప్రతిగా అందాన్ని త్యాగం చేసింది. కానీ, అభివృద్ది తక్కువగా వున్న కొడైలో అందం, ఆనందం, ఆహ్లాదం తాండవం చేస్తున్నాయి అని.

17 మే, 2010
పెళ్లి - ఒక కన్‌ఫ్యూజన్
1995: 10వ తరగతి
పెళ్లంటే - పెద్దవాళ్లు చేసుకుంటారు. కట్నం పేరుతో డబ్బులిస్తారు. పెళ్లాం వస్తుంది... పనులు చేసి పెడుతుంది. కొత్త బంధువులు, కొత్త బంధుత్వాలు. బామ్మర్ది వస్తాడు. ఏ పని చెప్పినా చేసిపెడతాడు.
2000: ఇంజినీరింగ్ స్టుడెంట్
పెళ్లంటే - చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, వాళ్ల చదువులు, వాళ్ల పిల్లలు, మనువలు మనువరాల్ల చదువులు, చావు. ఇదీ జీవితం. మన మొహానికి అమ్మాయిలు పడే ఛాన్స్ కనుచూపుమేరలో కనపడట్లేదు కాబట్టి, బై ఫోర్సు అయినా, పెళ్లామే మొదటి గర్ల్ ఫ్రెండ్ అవుతుంది కాబట్టి పెళ్లానికి ఐశ్వర్య రాయి కి ఉన్నంత అందం, సునీతకున్నంత చక్కని కంఠం, అదేదో పాత సినిమాలో సావిత్రికున్నంత అణకువ, ఇంకేదో సినిమాలో సౌందర్యకున్నంత సంస్కారం గట్రా గట్రా వుండాలని ఎక్స్‌పెక్టేషన్స్...!!! ఇన్ని మంచి క్వాలిటీస్ వున్న పిల్ల నిన్నే ఎందుకు చేసుకోవాలీ అని నన్ను ఎవరూ అడగలేదు కాబట్టి... నేను కూడా ఆన్సర్ రెడీ చేసుకోలేదు.
2005: ఉద్యోగ ప్రయత్నం ("బేవార్సు"కి పర్యాయ పదం)
పెళ్లంటే - బరువు బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీ, స్థిరత్వం, కుటుంబం, ఆనందం, జీవనసారం, తొక్క తోలు లాంటి ఏవో అర్థం తీలీని, సామాన్య మానవునికి అర్థం కాని ఒక జఢపదార్థం. కానీ, సంపాదన లేని మొగుడ్ని ఈ రోజుల్లో ఏ ఆడదీ గౌరవించదనీ, పెళ్లనేది తప్పించుకోలేని ఒక సామాజిక అవసరం కాబట్టి ఎంత తొందరగా సంపాదన మొదలు పెడితే అంత మంచిది అని ఒక ఫీలింగ్.
2010: ఎలిజిబుల్ బ్యాచిలర్
పెళ్లంటే - ఇది తర్వాత మాట్లాడుకుందాం.
ఇన్ని రోజులు కలిసున్న ఫ్రెండ్సుకి పెళ్లిల్లయిపోయాయి. పెళ్లిల్లు అంటె, తప్పుగా అర్థం చేసుకోవద్దు. మనిషికి ఒక్కటే అయ్యింది ప్రస్తుతానికి. పెళ్లేం ఖర్మ... ఒకరిద్దరు తండ్రులు కూడా అయ్యారు. అయ్యారు కానీ, స్వాతంత్ర్యం పోగొట్టుకున్నారనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అర్ధరాత్రి, అపరాత్రి ని తేడా లేకుండా గాలికి తిరిగిన వాళ్లు ఇప్పుడు పట్టపగలు కూడా ప్రశాంతంగా తిరగలేకపోతున్నారు. ఏదైనా పని మీద బయటికి వెళ్తే, వచ్చేముందు ఎదో మాటవరసరకి గంటలో వస్తామని చెప్తారా... గంటా పది నిమిషాలవరకూ బాగానే వుంటుంది... గంటంపావు కాగానే ఫోను మోగుతుంది. ఎక్కడ, ఎందుకు, ఎంతసేపు, ఏమిటి... అంటూ ప్రశ్నల వర్షం మొదలవుతుంది. అసలే హాస్టలు, ఆ తర్వాత ఇంటికి దూరంగా ఉద్యోగం పేరుతో స్వాతంత్ర్యానికి అలవాటుపడ్డ ప్రాణమేమో.... ఉస్సూరుమంటుంది.
మాటవరసకి ఈవీకెండ్‌లో సినిమాకు పోదాం అని చెప్పి, తీరా వీకెండ్‌లో ఏదో పని పడి సినిమా పోస్ట్‌పోన్ చేస్తే పాపం వాళ్ల కష్ఠాలు చెప్పుకోతరం కాదు. ఇంకో రెండుమూడు వీకెండ్లు వరసగా సినిమాలకు తీసుకెళ్లినా ఇంట్లొ గొణుగుడు మాత్రం ఆగదు. ఆ గొణుగుడుని భరించలేక, ప్రతీ వారం బయటికి తీసుకెల్లి జేబుకు పడే చిల్లు పూడ్చలేక లోపల లోపల పడే బాధ కొంచెం కాదు.
పెళ్లంటే ఇన్ని కష్టాలుంటాయని తెలీని రోజుల్లో, అంటే, మా బ్యాచ్‌లో ఎవరికీ పెళ్లి కాని రోజుల్లో.. మొడటి వాడు పెళ్లి చూపులకు వెళ్తున్నప్పుడు అన్నాడు... పెళ్లి చేసుకుంటే, రోజు ఆఫీసునుంచి వచ్చేసరికి నీ కోసం ఎదురుచూసే మనిషి వుంటుంది. అసలు ఒక మనిషి నీకోసం ఎదురు చూస్తున్న ఫీలింగే ఎంతో బాగుంటుందిరా అని అన్నాడు. కానీ, మా రూములో అలానే ఎదురుచూసుకునే వాళ్లం. ఎవనికైనా లేట్ అయితే, రూములో వున్నవాడు ఫోన్ చేసేవాడు, ఎక్కడున్నావురా ఎప్పుడొస్తావురా అని... మరీ లేట్ అయ్యేలా వుంటే తప్పించి, అందరూ వచ్చాక అందరం కలిసే మొదలుపెట్టేవాళ్లం... తినుడైనా, తాగుడైనా, తిరుగుడైనా!!! కానీ ఈ ఎదురుచూపుల ఫీలింగ్ ఇన్ని రోజులు అనిపించలేదెందుకు చెప్మా? అని డౌటొచ్చింది. కాని వాడిని అడగలేదు... అసలే ముక్కోపి, అడిగితే ఎలాంటి ఆన్సర్ చెప్తాడో అని భయమేసి ఆగిపోయ్యా.
అసలిదంతా ఎందుకు మొదలెట్టానంటే, మా బ్యాచులో చాలామందికి పెళ్లిల్లయిపోయాయి. అఫ్‌కోర్స్, నాకింకా ఈ కష్టాలు మొదలవలేదనుకోండి. కానీ, నాకు అదే పెద్దకష్టం అయ్యిపోయింది. అసలే, ఈ మధ్యే లోను తీస్కొని మరీ ఇల్లు కొని అప్పులపాయ్యానేమో, ఈ అప్పుల మధ్య పెళ్లి అవసరమా అని నాకొక అనుమానం. కానీ అదో పెద్ద సమస్యే కాదన్నట్టు అందరూ సలహాలూ. ఈ మధ్య ఎవడు కలిసినా, ఎవనితో ఫోనులో మాట్లాడినా అటోమాటిగ్గా టాపిక్ నా పెళ్లి దగ్గరికి పోతోంది. మొన్న ఇలాగే ఒకడు ఫోన్‌చేసాడు. వాడేదో నా పెళ్లి ముహూర్తం కనుక్కోడానికే చేసినట్టు, ఫోన్ ఎత్తగానే పెళ్లెప్పుడురా అన్నాడు. టాపిక్ మార్చరా అంటే, ఇప్పుడు నేను మారుస్తా గానీ వచ్చే నెలలో మీ బంధువులందరూ గెట్-టుగెదర్ వుందన్నావుగా... అక్కడ అందరూ అడుగుతారు, వాళ్లకేం చేప్తావ్ అంటూ ఒక డౌటు లేపాడు. ఇప్పుడు నాకున్న సమస్య పెళ్లి కాదు, పెళ్లెప్పుడు అని అడుగుతున్న బంధువులకు, ఫ్రెండ్సుకు సమాధానం... నాకిన్ని కష్టాలు వస్తాయని కలలో కూడా అనుకోలేదు...:-( ఇప్పుడు కూర్చుని అందరికీ చెప్పాల్సిన సమధానం గురించి ఆలోచించాలి... ఏం చెప్పాలో ఎనీ ఐడియా...?!?!?!?!

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)