ఉజ్వల్ నికం - ఒక గొప్ప న్యాయవాది. తన వాక్పటిమతో న్యాయాన్ని నిలబెట్టేవాడు... నిలబెడుతున్నవాడున్నూ! లేకుంటే ఇన్ని ప్రతిష్ఠాత్మకమైన కేసులకి ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం తన తరఫు న్యాయవాదిగా నియమించుకోవు కదా. ఈమధ్యే తెలిసింది... తన వాక్పటిమతో ఇప్పటికి వంద పైచిలుకు మందికి జీవితఖైదులూ, డజన్లమందికి మరణశిక్షలూ పడేలా చేసాడని. ఇప్పుడాయన గురించి ఎందుకు చెప్పానంటే మొన్ననే అతనొక కేసు గెలిచాడు. అదే... ముంబాయి మీద తెగబడ్డ ముష్కరులలో ఒకడైన కసబ్ తాలూకూ కేసు. అతని పేరుతోనే మొదలుపెట్టడానికి రెండు రీజన్లిన్నాయి. ఒకటి, ఈ టపాని ఒక పాజిటివ్ నోట్‌తో మొదలెట్టాలని. రెండు, కసబ్‌ని చంపాలనే సగటు భారతీయుని కోరికను తను చట్టపరంగా తీర్చే వెసులుబాటు కల్పించాడు. కానీ మన (సగటు భారతీయుని) కోరిక తీరుతుందా... లెట్ అస్ ఇన్వెస్టిగేట్. రండి, విశ్లేషిద్దాం.
కొన్ని సంవత్సరాల క్రితం, అనగా 2001లో, భారత రాజ్యాంగ వ్యవస్థకు పట్టుకొమ్మ, భవిష్యభారతానికి దిశానిర్దేశం చేసే సభాభవనాల సముదాయం - భారత పార్లమెంటు భవనంపై తీవ్రవాదుల దాడి జరిగింది. దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఐదుగురు తీవ్రవాదులూ మరణించారు. వారితోపాటు ఆరుగురు పోలీసులు (వారిలో ఒకరు మహిళ) మరియు ఒక తోటమాలి. ఆ తరువాత 2004 వరకు ఈ కేసులో చాలా పురోగతి కనిపించింది. ఈ దాడితో సంభందమున్న వారిని అరెస్టు చేసి, కోర్టులో విచారణ జరిపించడం, పట్టుకున్న అందరినీ దోషులుగా కోర్టు తేల్చడం, అఫ్జల్ గురు అనే ఒకనికి ఉరి శిక్ష వేయడం, తీర్పులపై ఉన్నత న్యాయస్థానికి వెళ్లడం, సుప్రీంకోర్టు ఉరిశిక్షను ఖరారు చేయడం... అన్నీ జరిగిపోయాయి. కేసు ఇన్ని కోర్టులు తిరిగి, ఇంత త్వరగా తీర్పు రావడం సామాన్యుడికి భారత న్యాయ వ్యవస్థ మీద నమ్మకాన్ని కొంచం పెంచాయి. ప్రతీ పౌరుడు అఫ్జల్కి పడ్డ ఉరిశిక్షని అమలుచేసే తేదీ కోసం ఎదురు చూసారు. ఒక సుముహుర్తాన, ఆ ముహూర్తాన్ని కూడా ప్రకటించారు. అక్కడినించి, సదరు ఉరిశిక్షని ఆపండంటూ మన సోకాల్డ్ సెక్యులరిస్టులు చక్రాలు తిప్పారు.
అతని భార్య 'నా భర్తకు క్షమాభిక్ష పెట్టండి మహాప్రభో' అని అప్పటి రాష్ట్రపతి కలాం అయ్యవారికి ఒక నివేదిక పెట్టుకుంది. అది మీడియా ప్రసారం చెయ్యడం ఆలస్యం, సదరు రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి. మేధావి వర్గానికి చెందినవారు కొందరు అఫ్జల్‌ని బలి పశువుగా వర్ణించారు. కాషాయాన్ని నమ్ముకున్నవారు మాత్రం ఉన్నపళంగా ఉరితీయాలని పట్టుబట్టారు. చివరికి బంతి కలాం గారి కోర్టులో పడింది. ఆయనగారు అధ్యక్ష భవనం నుంచి పోతూ పోతూ చట్టం తనపని తాను చేసుకుపోతుంది, నేను తలదూర్చను అని చెప్పేసి వెళ్లిపోయారు. మళ్లీ ఎన్నికలొచ్చాయి. సెక్యులరిస్టులు అధికారంలోకొచ్చారు. సదరు అఫ్జల్‌గారి సెల్‌లోకి ఉష్ణనియంత్రన వ్యవస్థ కూడా అప్పుడే వచ్చిందని అప్పట్లో వినిపించింది (నిజం దేవుడెరుగు). ఇప్పటికీ అఫ్జల్ జైలులోనే AC సెల్లులో కూర్చుని కలర్ TV చూస్తూ పండగ చేసుకుంటున్నాడు. మన సెక్యులరిస్టు ప్రభుత్వాన్ని అడిగితే, మన ముసలి రబ్బరు స్టాంపు ముందు 29 అర్జీలున్నాయి. అఫ్జల్‌ది 25వది. మొదలొచ్చినవన్నీ పక్కనబెట్టి ఇది మొదలు ఎలా చూస్తారు... అందుకే మిగిలినవాటిపై నిర్ణయం తీసుకున్నాకే దీనిపై నిర్ణయం అని తెగేసి చెప్తున్నారు. ఈ లెఖ్ఖన మొదటి 24 అర్జీలు తేలేదెన్నడూ... అఫ్జల్‌ని ఉరి తీసేది లేదని ధైర్యంగా చెప్పేదెన్నడూ...!!! అయినా పార్టీ పెద్దలకుగుణంగానో, బడా వ్యాపారవేత్తలనుకుగుణంగానో ప్రయారిటీలు మారినప్పుడు లేనిది, అంతర్గత రక్షణ పేరుమీద ఈ విషయంలో ప్రయారిటీలు మార్చలేరా....? బహుశా "ఠాగూర్"లో చిరంజీవి అన్నట్టు, అన్యాయాన్ని నిలదీసినవాడిని మాత్రమే ఉరితీస్తారేమో... ఎవరికైనా ఈ విషయంమీద ఒక ఐడియా వుంటే చెప్పండి.
ఇప్పుడు కసబ్ విషయంలో కూడా ఇలాగే జరగదని ప్రజలకి నమ్మకం ఏంటి అన్నది నా సందేహం. (ఆ మాటకొస్తే నాకు కూడా నమ్మకం లేదు.) అన్నిటికంటే నాకు నవ్వు తెప్పించిన విషయం వేరొకటుంది. అది, కసబ్‌ని కోర్టు దోషిగా తేల్చిన రోజు మన కేంద్ర మంత్రి మండలిలోని ఒక మంత్రివర్య్లు ఒక మాట అన్నారు - 'ఇది పాకిస్తాన్‌కు ఒక హెచ్చరిక. ఇకనైన వారు తీవ్రవాదాన్ని పోశించడం మానుకోవాలీ వగైరా వగైరా... కానీ మన మంత్రివర్యులు అలోచించడం మరిచిందేమంటే, అఫ్జల్ విశయంలో జరిగింది చూసినతర్వాత అదే పాకిస్తాను పెద్దలకు మన ప్రభుత్వానికి అంతర్గత రక్షణపై వున్న అలసత్వం అర్థం కాదా అని. అన్నట్టు ఇక్కడో విషయం చెప్పుకోవాలండోయ్... ఇదివరకు ఇలానే కొందరిని పట్టుకొని జైలులో పెట్టి మేపితే, వాళ్లు తిన్నరగట్లేదు... కానీ బుద్ది పెరిగింది, తీసుకెళ్తే ఇంకా మంచి దాడులు చేస్తాం అని వాళ్ల పెద్దలకి కబురంపారంట. వెంటనే వాళ్లు ఒక విమానాన్ని హైజాక్ చేసి, వాళ్లని విడిపించుకున్నారు. వాళ్లలో ఒకడే, ఈ అఫ్జల్ గురు ని తయారు చేసాడనుకుంటా. ఇంకొకడు ముంబాయి లోకల్ ట్రైనులల్లో బాంబులు పెట్టించడమో ఏదో చేసాడు. చూస్తే వీళ్లిద్దరినీ కూడా ఇంకా భయంకర దాడులకు వ్యూహరచన చేసుకునేదాకా మన డబ్బులతో మేపి పంపించేటట్టున్నారే...? అయినా మన రాతే ఇలా వుంటే ఏం చేస్తాం లెండి. పదో పరకో పడేస్తే వచ్చే బుల్లెట్‌తో పోయే ప్రాణాన్ని నిలబెట్టి కోట్లు ఖర్చు పెట్టి బిర్యానీలతో మేపి, కోర్టులచుట్టూ తిప్పి, AC రూముల్లో పడుకోబెట్టి మళ్లీ మనమీద దాడులెలా చేయ్యాలో ఆలొచించమంటున్నాం... వద్దులెండి.. ఇంక రాయను.. నోటికెచ్చే మాటలను చేతిదాకా తేవడానికి సంస్కారం అడ్డొస్తోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి