01 నవంబర్, 2015

కంచె సినిమా.. my view not a review

Cortesy: My childhood buddy Amit (copied from his FB post)

యుద్ధం అంటే ఓ కొత్త అర్థం దొరికింది..
యుద్ధం అంటే ప్రేమించడం

తన దేశాన్ని ప్రేమించడం
తన ఊరిని ప్రేమించడం తన వారిని ప్రేమించడం
ఆ ప్రేమ కోసం తెగించడం

ప్రతి ప్రేమికుడు ఓ సైనికుడే, ప్రతి సైనికుడు ఓ ప్రేమికుడే..

కంచె సినిమా.. మంచి పది పుస్తకాలను 2 గంటల్లో చదివినంత "ఎంటర్తైన్మంట్" దొరికింది

"గర్భాన్ని వాడుకునె రకం అమ్మ వాల్లు".. ఈ డైలాగ్ వెంటాడుతోంది,
ఆడదాన్ని అవమానించే ప్రతి మగాడు  
అమ్మని గౌరవించని ప్రతి కొడుకు గర్భాన్ని వాడుకునే రకాలే

ఇష్టానికి ప్రేమకు వ్యత్యాసo.. పూలు తెంపితే ఇష్టం నీల్లు పోస్తే ప్రేమ అని.

సాయి మాధవ్ రెండు ముక్కల్లో వేదాలను చెప్పేస్తాడు, క్రిష్నం వందె జగద్గురుం , మల్లి మల్లి ఇది రాని రొజు  ఇప్పుడు కంచె . రెండుముక్కల్లో ఆయన ఓ అద్భుతం , అతిశయం

ఆకర్షించే అమ్మాయి , దండం పెట్టె అమ్మగా (హరిబాబు సైన్యాన్ని కాపాడె సీన్) అవతరించె  సీన్ స్పీచ్ లెస్  .. క్రిష్ మాటల్లేవు, నువ్వు అందరి కన్న ఓ మెట్టు ఎక్కువే

ఇదేం తెలుగు సినెమ ర బాబు
ఎక్కడా హెరొ హీరొయిన్ కనిపించరు ..క్యారెక్టర్స్  కనిపిస్తయి
ప్రేమ , పోరాటం కనిపిస్తుంది
అసలు కామెడీ ట్రక్ లెదు.. హాస్యం 'అవసరా'నికి ఉంది సరిపొయేంతగ
 
ఇది రెగ్యులర్ తెలుగు సినెమా అయితె కాదు. తెలుగు సినెమ లెక్కల్లో ఇది ఫిట్ అవదు  అందుకే దీనికి రేటింగ్స్ ఇవ్వకుండ ఓ ప్రశంస ఇవ్వాలి, క్రిష్ ధైర్యానికి .

appreciation to costume designer.

కొన్ని సినెమాలు అంతె..
ద్రుశ్యాలు మనసును చేరి అక్షరాలుగా రూపాంతరం చెందుతాయి ..  అలాంటి వాటి గురించి ఏదో ఒకటి రాయాలనిపిస్తుంది


1 కామెంట్‌:

  1. శివరామ ప్రసాద్నవంబర్ 03, 2015

    సరిగా చెప్పారు, తెలుగు సినిమా equations కి అందని దృశ్య కావ్యం!

    రిప్లయితొలగించండి